దమ్ముందా: ఈసికి అజం ఖాన్ సవాల్, మోడీపై లాలూ

లక్నో: కేంద్ర ఎన్నికల సంఘం పైన సమాజ్ వాది పార్టీ నేత, మంత్రి అజం ఖాన్ మరోసారి మండిపడ్డారు. ఎన్నికల సంఘం తాను ఏదో భగవంతుడిని అన్నట్లుగా వ్యవహరిస్తోందని ప్రవర్తిస్తోందని వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్‌లో ప్రచారం చేయకుండా తనను నిషేధించిన ఈసికి దమ్ముంటే.. తన అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సవాల్ విసిరారు. రాజ్యాంగస్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండేలా ఎన్నికల కమిషన్ నడుచుకోవాలన్నారు.

EC Cannot Behave Like God, Says Azam Khan

మోడీనే పంపించాలి: లాలూ

నరేంద్ర మోడీపై ఆర్జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. మోడీని పాకిస్తాన్‌కు పంపించాలన్నారు. మోడీని పాకిస్తాన్‌కు పంపించడమే ఆయనకు సరయిన మందు అన్నారు. ఆయన పార్టీ మనుషులు ఇతరులను పాకిస్తాన్‌కు పంపించడం గురించి మాట్లాడుతున్నారని, వాళ్లకు బదులు మోడీనే పాక్‌కు పంపించాలని గురువారం అన్నారు.

బిజెపి మండిపాటు

లాలూ వ్యాఖ్యలపై బిజెపి అధికార ప్రతినిధి షాన్‌వాజ్ హుస్సేన్ తీవ్రంగా మండిపడ్డారు. మోడీకి బదులు లాలూనే ఎందుకు పాక్‌కు పంపించకూడదన్నారు.

దేశంలో తానే పాపులర్ అని లాలూ చెప్పుకుంటారని, అందువల్ల ఆయననే అక్కడికి పంపించడం తెలివైన నిర్ణయం అవుతుందన్నారు. భారత్ గురించి మాట్లాడేటప్పుడు పాకిస్తాన్, దాని మంత్రులు తమ హద్దుల్లో ఉండడం మంచిదన్నారు. భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం వాళ్లకు లేదని, తమ ప్రధానమంత్రిగా ఎవరుండాలో నిర్ణయించాల్సింది ఈ దేశ ప్రజలే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+