Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎవరికి మూడిందో గానీ- అర్జంట్ గా ప్రెస్ మీట్ పిలిచిన ఈసీ: సీన్ రసవత్తరం

దేశంలో ప్రస్తుతం ఓట్ చోరీ ఉద్యమం నడుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రల్లో పెద్ద ఎత్తున ఓట్లను దొంగిలించారంటూ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల అనంతరం ఈ మూమెంట్.. క్రమంగా ఊపందుకుంటోంది. దీనికి నిరసనగా కాంగ్రెస్, ఇండియా బ్లాక్ పార్టీలు రోడ్డెక్కుతున్నాయి.

ఈ పరిస్థితుల మధ్య కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు దేశ రాజధానిలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటైంది. ఈ మేరకు ఈసీ డైరెక్టర్ జనరల్ నుంచి మీడియా ప్రతినిధులకు సమాచారం అందింది. ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో ఈసీ ప్రెస్ ను పిలవడం చర్చనీయాంశమౌతోంది.

EC to hold a Press Conference Sunday August 17 2025

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఓటర్ల జాబితా సవరణ, ఓట్ చోరీ.. వంటి కీలక అంశాలకు సంబంధించిన సమగ్ర వివరాలను ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది. ఓట్ చోరీ ఆరోపణలు వెల్లువెత్తిన తరువాత ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేయడం కూడా ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ప్రతిపక్ష పార్టీలు- ముఖ్యంగా కాంగ్రెస్, ఆ పార్టీ లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఉద్యమాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే. ఓటర్ల జాబితాలో అక్రమాలు వంటి అంశాలపై ఈసీని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం తన వైఖరిని స్పష్టం చేయవచ్చని భావిస్తున్నారు.

బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మహదేవ్‌పుర అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 1,00,250 ఓట్లు చోరీ అయ్యాయని రాహుల్ గాంధీ సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు ఈ మధ్యే. డూప్లికేట్ ఓటర్లు, నకిలీ చిరునామాలు, ఒకే చిరునామాలో వందలాది మంది ఓటర్ల పేర్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ అక్రమాలు జరగకపోతే కాంగ్రెస్ కర్ణాటకలో 16 లోక్‌సభ సీట్లు గెలిచి ఉండేదని, కానీ 9 సీట్లు మాత్రమే గెలిచిందని రాహుల్ గాంధీ అన్నారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలలో కూడా ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని, అయిదు నెలల్లో లక్షలాది మంది ఓటర్ల పేర్లు అసాధారణంగా చేర్చారని ఆరోపించారు.

ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కైందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. డిజిటల్, మెషిన్-రీడబుల్ ఓటర్ల జాబితాను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలకు ఎన్నికల సంఘం గతంలోనే చాలాసార్లు స్పందించింది. అవి వాస్తవ విరుద్ధమని, తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని తోసిపుచ్చింది.

కాగా- బిహార్ ఓటర్ల జాబితాలోని తొలగింపునకు గురైన 65 లక్షల ఓటర్ల వివరాలను కారణాలతో సహా వెబ్ సైట్ లో ప్రచురించాలని సుప్రీంకోర్టు ఇటీవలే ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలను కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈసీ వెల్లడించే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+