రాజ్యసభ ఎన్నికలు- మూడు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా: మాజీలు కాబోయే ఎంపీలు వీరే

న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు విడుదల చేశారు. ఈ నెల 24వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. అదే రోజున ఓట్ల లెక్కింపును చేపడతారు. విజేతల పేర్లను ప్రకటిస్తారు. 26వ తేదీ నాటికి ఈ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.

మూడు రాష్ట్రాలు- గుజరాత్, గోవా, పశ్చిమ బెంగాల్‌లల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన సభ్యుల కాల పరిమితి ముగియనుంది. గోవా నుంచి వినయ్ డీ టెండుల్కర్ సభ్యత్వం జులై 7వ తేదీన ముగుస్తుంది. గుజరాత్‌ను రాజ్యసభకు నామినేట్ అయిన దినేష్ చంద్ర జెమాల్‌భాయ్ ఆనవిదియ, లోఖండ్‌వాలా జుగల్‌సిన్హ్ మాథుర్‌జీ, విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ మాజీలు కాబోతోన్నారు.

 ECI announced the schedule for Rajya Sabha polls in Gujarat, West Bengal and Goa, deets inside

ఈ ముగ్గురి సభ్యత్వం ఆగస్టు 18వ తేదీ నాటికి ముగియాల్సి ఉంది. ఇక పశ్చిమ బెంగాల్ నుంచి నామినేట్ అయిన వారిలో డెరెక్ ఒబ్రెయిన్, డోలా సేన్, ప్రదీప్ భట్టాచార్య, సుస్మిత దేవ్, శాంత ఛెత్రి, సుఖేందు శేఖర్ రే.. సభ్యత్వం కూడా ఆగస్టు 18వ తేదీకి ముగుస్తుంది. వారి కాల పరిమితి ముగియడం వల్ల ఖాళీ అయ్యే స్థానాలకు జులై 24వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది.

జులై 6వ తేదీన నోటిఫికేషన్ వెలువడుతుంది. నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి చివరి తేదీ 13. నామినేషన్ల పరిశీలన గడువు 14వ తేదీ. ఉపసంహరణ తేదీ 17. 24వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజున సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కాగా- సుబ్రహ్మణ్యం జైశంకర్‌ను కేంద్రం నామినేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+