మోడీసేన వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. కేంద్రమంత్రి నఖ్వీకి వార్నింగ్
ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణాస్త్రాలు సంధిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ క్రమంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ లీడర్ అజం ఖాన్ తదితర నేతలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝలిపించింది. ఆ జాబితాలో తాజాగా కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చేరారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఈ నెల 3వ తేదీన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న నఖ్వీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉగ్రవాదుల శిబిరాలపై వాయుసేన దాడిచేయగా.. మోడీసేన అంటూ ఆయన వ్యాఖ్యానించడం దుమారం రేపింది.
మోడీ సేన దాడులపై ఆధారాలు కావాలని విపక్షాలు కోరడం సరికాదంటూ నఖ్వీ ఆ ర్యాలీలో ప్రసంగించారు. ఆ మేరకు జిల్లా ఎన్నికల అధికారి ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

అదలావుంటే.. నఖ్వీ వ్యాఖ్యలపై అటు కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని అల్టిమేటం ఇచ్చింది. ఎన్నికల ప్రచార వేళ భద్రతా బలగాల ఊసెత్తొద్దని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications