నోట్ల కష్టాలకు మరింత ఊరట: కేంద్రం తాజా నిర్ణయాలు ఇవే
పెద్దనోట్ల రద్దు కారణంగా నగదు కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు కారణంగా నగదు కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. డెబిట్ కార్డుల వినియోగంపై రుసుములు పూర్తి ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ప్రకటించారు.
రైల్వేశాఖ ఆన్‌లైన్‌లో రైలు టికెట్ బుకింగ్‌కు డిసెంబర్ 31 వరకు సేవా రుసుము రద్దు చేసిందని.. ట్రాయ్ యూఎస్‌ఎస్‌డీ ఛార్జీలను రూ.1.50 నుంచి 50పైసలకు తగ్గించిందని తెలిపారు. ఈ-వ్యాలెట్లలో నగదు పరిమితిని ఆర్‌బీఐ రూ.20వేలకు పెంచినట్లు చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో నగదు కొరత లేకుండా 1.5లక్షల తపాలా కార్యాలయాలు నగదు సరఫరా చేస్తున్నట్లు శక్తికాంత దాస్ ప్రకటించారు. సహకార బ్యాంకులకు నాబార్డు రూ.21వేల కోట్లు మంజూరు చేసిందన్నారు.
దేశవ్యాప్తంగా 65శాతం మంది స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నందున.. డిజిటల్ లావాదేవీలపై సేవా రుసుము ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్బీఐకి డీసీసీబీల వివరాలను అందజేయడం జరిగింది. దీంతో అవసరమైన మొత్తాన్ని ఈ బ్యాంకులకు అందజేయడం జరుగుతుంది.
డిసెంబర్ 31 వరకు డెబిట్, రూపే కార్డుపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. ప్రభుత్వ కొత్త సంస్థలు, పబ్లిక్ సెక్టార్లు ఆన్‌లైన్ పేమెంట్ పద్ధతులను ఉపయోగించుకోవాలని సూచించారు. కాగా, ఆర్బీఐ చెప్పిన దాని ప్రకారం దేశంలోని 2 లక్షల ఏటీఎంలలో ఇప్పటివరకు 82 వేల ఏటీఎం సెంటర్లలో కొత్త నోట్లకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడం జరిగింది.












Click it and Unblock the Notifications