మనీలాండరింగ్ కేసు: రూ. 11.04 కోట్ల కార్తీ చిదంబరం ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంకు చెందిన రూ. 11.04 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం జప్తు చేసింది. అటాచ్ చేసిన నాలుగు ఆస్తుల్లో ఒకటి కర్ణాటకలోని నికూర్గ్ జిల్లాలో ఉన్న స్థిరాస్తి అని పేర్కొంది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎం ఎల్ఏ) కింద కార్తీపై తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రకటన పేర్కొంది. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం తమిళనాడులోని శివగంగ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.

ఐఎన్ఎక్స్ కేసులో సీబీఐ, ఈడీ గతంలో కార్తీ చిదంబరంను అరెస్ట్ కూడా చేసింది. ఈ కేసు ఐఎన్ఎక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి "ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా" సొమ్ము పొందినట్లు ఆరోపణలున్నాయి.యూపీఏ ప్రభుత్వ హయాంలో చిదంబరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులను స్వీకరించడంలో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఈడీ విచారణ జరుపుతోంది. అక్రమాలు జరిగాయని విచారణలో భాగంగా తేలిందని ఈడీ పేర్కొంది. కాగా, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తమ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కార్తీ చిదంబరం ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications