Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే మైండ్ బ్లాక్, ఈడీ, సిట్ దెబ్బ, హైదరాబాద్ బ్యాంకులో?

కర్ణాటకలో మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి సంస్థకు చెందిన కోట్లాది రూపాయల కుంభకోణానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) మధ్య అంతర్గత పోరు మొదలైంది.ఒకే కేసును రెండు దర్యాప్తు సంస్థలు ఏకకాలంలో విచారించడంతో ఈ సమస్య తలెత్తింది. అయితే ఈ కేసులో మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటంతో కలకలం రేపుతోంది.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 11 మంది నిందితులను కర్ణాటక సిట్ అరెస్ట్ చేసి. దాదాపు రూ. 40 కోట్లు రికవరీ చేసింది. ఇంకా 49. కోట్లు బకాయి ఉంది. గోల్ మాల్ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈలోగా ఈడీ విచారణ ప్రారంభించి. కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే బి.నాగేంద్రను ఇదే స్కామ్‌కు సంబంధించి ఈడీ అరెస్టు చేసింది. వాల్మీకి కార్పొరేషన్ అధ్యక్షుడు బసన్‌గౌడ్‌ దద్దల్‌ తప్పించుకోవడంతో అతన్ని అరెస్ట్‌ చెయ్యాలని ఈడీ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు.

ED investigating former Karnataka minister in Valmiki Corporation scam case

వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణంపై ఇప్పటికే మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర ఆరోపణల కింద దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అక్రమ నగదు బదిలీలపై ఈడీ ప్రత్యేకంగా విచారణ జరుపుతోంది. నిందితులు నగదు బదిలీ చేసిన బ్యాంకులకు ఇప్పటికే లేఖ రాసి సమాచారం కోరారు. ఇప్పుడు ఈడీ కూడా విచారణ ప్రారంభించడంతో ఆ బ్యాంకులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి అని అధికారులు అంటున్నారు. నిందితుల నుంచి కార్పొరేషన్‌కు చెందిన మరో రూ. 49 కోట్లు రికవరీ చేయాల్సి ఉంది.

సిట్ విచారణ మధ్యలో ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ కేసు దర్యాప్తు వ్యవహారంలో గందరగోళం నెలకొందని సిట్‌లోని అత్యున్నత వర్గాలు తెలిపాయి. నిందితులు హైదరాబాద్‌లోని ఫస్ట్‌ ఫైనాన్స్‌ క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీలో ఏకంగా 18 నకిలీ ఖాతాలు తెరిచి కర్ణాటక వాల్మీకి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతా నుంచి రూ. 94.73 కోట్లను హైదరాబాద్ లోని ఈ 18 నకిలీ ఖాతాలకు బదిలీ చేశారు.

కర్ణాటక సిట్ విచారణలో బ్యాంకు అధికారుల ప్రమేయం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో నిందితులు వెంటనే రూ. 5 కోట్లను మళ్లీ వాల్మీకి కార్పొరేషన్ ఖాతాలో డబ్బులు జమ చేశారు. మిగిలిన రూ. 89 కోట్లలో నగదు, బంగారు ఆభరణాలు, లగ్జరీ కార్లను వాటి యజమానులకు తిరిగి ఇవ్వడం ద్వారా దాదాపు రూ. 40 కోట్లు రికవరీ చేశారు. నిందితుల నుంచి నగదును సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ED investigating former Karnataka minister in Valmiki Corporation scam case

ఈ కేసులో నిందితుడు సత్యనారాయణ ఇటకారి అధ్యక్షుడిగా ఉన్న హైదరాబాద్ లోని ఫస్ట్‌ ఫైనాన్స్‌ క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ ఖాతాలో రూ.40 కోట్లు ఉన్నట్లు సిట్‌ అధికారులు తెలిపారు. ఆ సొమ్ము కార్పొరేషన్ కు చెందినదా లేక సొసైటీకి చెందిన డిపాజిటర్ల డబ్బులా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు హైదరాబాద్, చెన్నై, ముంబాయి, బెంగళూరు సహా పలు బ్యాంకులకు చెందిన 193కి పైగా ఖాతాలు బదిలీ అయినట్లు విచారణలో తేలడంతో సంబంధిత బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది.

కర్ణాటక వాల్మీకి కార్పొరేషన్ కు చెందిన రూ. 20 కోట్లను మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగేంద్ర గత లోక్ సభ ఎన్నికల కోసం ఉపయోగించారని ఆరోపణలు రావడంతో ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు దర్యాప్తులో సిట్ ఇప్పటికే చాలా పురోగతి సాధించింది. ఇదిలా ఉండగా ఈడీ విచారణకు దిగడంతో రెండు దర్యాప్తు సంస్థల మధ్య గందరగోళం నెలకొంది. ఈ గందరగోళాన్ని ఎలా పరిష్కరిస్తారనే క్యూరియాసిటీ నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+