Builders: జస్ట్ రూ. 500 కోట్లు గోల్ మాల్, ఓజాకు ఖాజా తినిపించిన ఈడీ, ప్రజల డబ్బు ఏం చేశారంటే ?
బెంగళూరు: రియల్ ఎస్టేట్ పేరుతో భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రముఖ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ మీద ఈడీ అధికారులు పంజా విసిరారు. సుమారు రూ. 500 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. కరణ్ గ్రూప్ బిల్డర్స్ డెవలపర్స్ అధినేత మహేష్ బి. ఓజాను బెంగళూరులో ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
మనీలాండరింగ్ కు పాల్పడ్డారని మహేష్ బి, ఓజా అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది. రూ.500 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడ్డారని మహేష్ ఓజా మీద కేసు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన్న అరెస్టు చేసి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. మహేష్ ఓజాను విచారణ చెయ్యడానికి ప్రత్యేక కోర్టు 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది.

కోర్టు ఆదేశాలతో మహేష్ ఓజాను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడుల పేరుతో మోసం చేశారన్న ఆరోపణలపై మహేష్ ఓజాపై కర్ణాటక పోలీసులు ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మహేష్ ఓజా వివిధ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో మొత్తం రూ.526 కోట్లు అక్రమంగా పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారుల విచారణలో వెలుగు చూసింది.
మహేష్ ఓజాను గతంలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని ఈడీ అధికారులు తెలిపారు. రూ. 526 కోట్ల పెట్టుబడిలో కరణ్ గ్రూప్ బిల్డర్స్ చేపట్టిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో రూ. 121. 5 కోట్ల పెట్టుబడి పెట్టారు. విచారణలో ప్రజల నుంచి వచ్చిన సొమ్మును షెడ్యూల్డ్ ప్రాజెక్టుకు వినియోగించకుండా ఇతర అవసరాలకు అక్రమం కోట్లాది రూపాయలు వినియోగించినట్లు ఈడీ అధికారుల విచారణలో తేలింది. వందల కోట్ల రూపాయలు అక్రమంగా బదిలీ అయ్యిందని, నిందితుడిని అదుపులోకి తీసుకుని వచారణ చేస్తున్నామని ఈడి వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications