వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యంగ్ ఇండియా ఆఫీస్‌కు సీల్ వేసిన ఈడీ: సోనియా గాంధీ నివాసం వద్ద భారీగా పోలీసులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ భవనంలోని యంగ్ ఇండియన్ (వైఐ) కార్యాలయ ప్రాంగణాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఏజెన్సీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ప్రాంగణాన్ని తెరవరాదని ఆదేశాలు జారీ చేసింది.

వార్తా సంస్థ పీటీఐ కథనం ప్రకారం.. మంగళవారం దాడుల సమయంలో అధికార ప్రతినిధులు హాజరు కానందున.. "సాక్ష్యాధారాలను భద్రపరచడానికి" తాత్కాలిక సీల్ వేయబడిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మిగిలిన నేషనల్ హెరాల్డ్ కార్యాలయం ఉపయోగం కోసం తెరిచి ఉన్నాయని పేర్కొన్నాయి.

యంగ్ ఇండియన్ కార్యాలయ స్థలం వెలుపల ED దర్యాప్తు అధికారి సంతకం కింద అతికించిన నోటీసులో.. ఏజెన్సీ నుంచి "ముందస్తు అనుమతి లేకుండా" కార్యాలయం తెరవరాదు అని పేర్కొంది.

 ED Seals Young Indian Office, Amid National herald Money Laundering Probe: Cops Outside Sonia Gandhi House

మరోవైపు బుధవారం జన్‌పథ్‌లోని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసం వెలుపల ఢిల్లీ పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించారు.

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ, ఇతర ప్రదేశాలలో ఈడీ అనేక ప్రదేశాలపై దాడి చేసిన తర్వాత రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది.

కాగా, ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లే దారిని అడ్డుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా మారిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

ఇదిలావుండగా, ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లే రహదారిని దిగ్బంధించారని, ఇది మినహాయింపు కాకుండా ఆచారంగా మారిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా బారికేడ్లు వేసి సిబ్బందిని రంగంలోకి దించామని పోలీసులు తెలిపారు.

ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వెలుపల భారీ పోలీసు మోహరింపును చూపుతున్న వీడియోను షేర్ చేస్తూ.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్.. "ఢిల్లీ పోలీసులు ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లే రహదారిని అడ్డుకోవడం మినహాయింపు కాకుండా ఆచారంగా మారింది! ఎందుకు అలా చేశారన్నది మిస్టరీగా మారింది...." అని ట్వీట్ చేశారు.

సీనియర్ ఢిల్లీ పోలీసు అధికారి మాట్లాడుతూ.. "అక్బర్ రోడ్‌లో ఉన్న కాంగ్రెస్ కార్యాలయం వద్ద కొంతమంది నిరసనకారులు గుమిగూడవచ్చని మా స్పెషల్ బ్రాంచ్ నుంచి ఇన్‌పుట్‌లు అందాయి. కాబట్టి, నివారణ చర్యగా, మేము ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులను నివారించడానికి బారికేడ్లు వేసి మా సిబ్బందిని నియమించాము అని స్పష్టం చేశారు.

కాగా, ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు కాంగ్రెస్‌ నేతలు మల్లికార్జున్‌ ఖర్గే, సల్మాన్‌ ఖుర్షీద్‌, దిగ్విజయ్‌ సింగ్‌, పి చిదంబరం తదితరులు.

English summary
ED Seals Young Indian Office, Amid National herald Money Laundering Probe: Cops Outside Sonia Gandhi House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X