మన్నార్ గుడి మాఫియా చేతిలో ఉన్న జయా టీవీని స్వాధీనం చేసుకుందాం: పళని, పన్నీర్ !

అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ నటరాజన్ ను శాశ్వతంగా సాగనంపే విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తదితరులు ఏ నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేశారు.

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ నటరాజన్ ను శాశ్వతంగా సాగనంపే విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తదితరులు ఏ నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేశారు. ఇక పార్టీ కార్యకలాపాల మీద పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్ణయించారు.

మన్నార్ గుడి మాఫియా చేతిలో ఉన్న జయా టీవీ, అన్నాడీఎంకే పార్టీకి చెందిన నమతు ఎంజీఆర్ దిన పత్రికను స్వాధీనం చేసుకోవాలని సోమవారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. జయా టీవీ, నమతు ఎంజీఆర్ దిన పత్రిక స్వాధీనం చేసుకోవడానికి చట్టపరంగా చర్యలు తీసుకొవాలని నిర్ణయించారు.

 Edapadi Palanisamy group resulution take over Jaya TV and Namathu MGR

ఆగస్టు 10వ తేదీన టీటీవీ దినకరన్ ను అన్నాడీఎంకే పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించామని, ఇక అతని గురించి మాట్లాడే అవసరమే లేదని ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు సోమవారం జరిగిన సమావేశానికి హాజరుకాకపోవడంతో శశికళ విషయంలో ఓ నిర్ణయం తీసుకోలేకపోయారని తెలిసింది. సెప్టెంబర్ 14,15 తేదీల్లో పార్టీ కార్యవర్గ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసి శశికళను పార్టీ నుంచి శాశ్వతంగా సాగనంపడానికి చర్యలు తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+