షాక్: పుదుచ్చేరి రిసార్ట్ నుంచి అన్నాడీఎంకే ఎమ్మెల్యే జంప్, నో కామంట్, మన్నార్ గుడి !
తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి నాయకత్వం మీద తిరుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు మళ్లీ ఆయన గూటికి చేరుకుంటున్నారు దినకరన్ క్యాంప్ లో ఉన్న మరో
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి నాయకత్వం మీద తిరుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు మళ్లీ ఆయన గూటికి చేరుకుంటున్నారు దినకరన్ క్యాంప్ లో ఉన్న మరో ఎమ్మెల్యే రిసార్ట్ నుంచి గోడదూకేశారు.
అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యే జక్కయ్యన్ పుదుచ్చేరి సమీపంలోని రిసార్ట్ నుంచి చిన్నగా జారుకుని గురువారం ఎడప్పాడి పళనిసామికి మద్దతు ప్రకటించారు. ఎడప్పాడి పళనిసామి వెంటే తాను ఉంటానని, దినకరన్ గ్రూప్ లో చేరి పెద్ద తప్పు చేశానని ఎమ్మెల్యే జక్కయ్యన్ అంటున్నారు.

గురువారం మీడియాతో మాట్లాడిన జక్కయ్యన్ తనకు మభ్యపెట్టి పుదుచ్చేరి రిసార్ట్ కు తీసుకెళ్లారని ఆరోపించారు. ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం నాయకత్వంలోనే తమిళనాడు అభివృద్ది జరుగుతుందని అన్నాడీఎంకే ఎమ్మెల్యే జక్కయ్యన్ అన్నారు.
జయలలిత తనకు రాజకీయ భిక్ష పెట్టారని, అమ్మ ఆశయాల కోసం కష్టపడుతున్న పళనిసామి, పన్నీర్ సెల్వంకే తన మద్దతు ఉంటుందని అన్నారు. జక్కయ్యన్ జంప్ విషయంపై మాట్లాడటానికి టీటీవీ దినకరన్, ఆయన మద్దతుదారులు నిరాకరించారు. జక్కయ్యన్ మద్దతు ఇవ్వడంతో ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం సంతోషం వ్యక్తం చేశారు. మిగిలిన ఎమ్మెల్యేలు తిరిగి వచ్చి మాకు మద్దతు ఇస్తారాని పళని, పన్నీర్ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications