షాక్: ఎనిమిదేళ్ల బాలిక ఆత్మహత్య, కొడుకు పెళ్లి విషయమై దంపతులు
బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన స్థానికులను కలిచివేసింది. ఆ చిన్నారి తనకు తాను నిప్పు అంటించుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ సంఘటన జరిగినప్పుడు ఆ బాలిక తన ఇంట్లో ఒంటరిగా ఉంది.
తన చావుకు ఎవరు కారణం కాదని ఆమె తన సూసైడ్ నోట్లో పేర్కొనడం గమనార్హం. ఆమె గత ఇరవై రోజులుగా స్కూల్‌కు కూడా వెళ్లడం లేదు. ఆమె పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. తన మృతికి ఎవరు కారణం కాదని బాలిక సూసైడ్ నోట్లో పేర్కొందని పోలీసులు తెలిపారు.
చెన్నైలో దంపతుల ఆత్మహత్య

తన కొడుకుకి చేసిన పెళ్లి ఫెయిల్ కావడంతో చెన్నైకి చెందిన దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెన్నై ఔట్ స్కర్ట్స్‌లోని మరైమలై నగర్‌లో ఉంటున్న ఆ భార్యాభర్తలు విషం తాగి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారితో పాటు వారి 26 ఏళ్ల కొడుకు కూడా విషం తాగాడు. అయితే అతను ప్రాణాలతో బయటపడ్డాడు.
రాజన్ (51), లిల్లీరాణి (45)లు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని, వారి కొడుకు ప్రిన్స్ కూడా విషం తాగాడని, అయితే అతను ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రిన్స్ ఆత్మహత్య చేసుకునేందుకు తన మణికట్టును కూడా కోసుకున్నాడని పోలీసులు తెలిపారు.
వారు విషం తాగిన విషయం గుర్తించిన స్థానికులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోగా దంపతులు మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలం నుండి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ప్రిన్స్ మ్యారేజ్ ఫెయిల్ కావడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు అందులో ఉంది.
ప్రిన్స్ నాలుగు నెలలక్రితం సోఫియా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రిన్స్ చెన్నైలోని ఓ ప్రయివేటు ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే, విభేదాల కారణంగా కోడలు ఇంటిని విడిచి పెట్టి వెళ్లింది. తమ కోడలు ఇంటిని విడిచి పెట్టి పోవడానికి తాము కారణం కాదని కూడా సూసైడ్ నోట్లో పేర్కొన్నారు.
తమ కోడలుకు చెందిన ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను తాము ప్రిన్స్ గదిలో దాచి పెట్టామని అందులో పేర్కొన్నారు. వాటిని ఆమెకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాగా, ఆత్మహత్య చేసుకున్న దంపతుల కూతురు తిరువాన్మయూరులో తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications