రైతులకు విజ్ఞప్తి: కంది పంటకు ఎల్‌ నినో గండం!

దేశంలోని రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని 'ఎల్‌ నినో' (El Nino) వాతావరణ మార్పులు మరోసారి భయపెడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల వచ్చే ఈ ఎల్‌ నినో ఎఫెక్ట్‌తో.. ఈ ఏడాది (2026) నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే 10 శాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.

దీనివల్ల 2026-27 పంట సంవత్సరంలో పప్పుధాన్యాలు, నూనె గింజల దిగుబడి, ముఖ్యంగా మన ఇళ్లలో నిత్యం వాడే కందిపప్పు, సోయాబీన్ పంటల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరిస్థితిని సమీక్షించడానికి అధికారులు ప్రతి వారం అంతర్గత సమావేశాలు కూడా జరుపుతున్నారు.

El Nino Threat To Indian Agriculture Pulse And Oilseed Production May Drop Ten Percent Due To Weak Monsoon

2015 నాటి చేదు జ్ఞాపకాలు.. కానీ ఇప్పుడు భయం లేదు!

గతంలో బలమైన ఎల్‌ నినో వచ్చిన 2015 సంవత్సరంలో వర్షాలు 14 శాతం తక్కువగా పడి పంటలు బాగా దెబ్బతిన్నాయి. అప్పట్లో వరి ఉత్పత్తి 2 శాతం, పప్పుధాన్యాలు 17 శాతం, నూనె గింజలు 29 శాతం వరకు తగ్గిపోయాయి. అయితే, నాటితో పోలిస్తే 2026లో దేశం చాలా మెరుగైన స్థితిలో ఉందని ప్రభుత్వ సీనియర్ అధికారులు భరోసా ఇస్తున్నారు. "గడిచిన పదేళ్లలో దేశవ్యాప్తంగా సాగునీటి కాలువల వ్యవస్థ బాగా మెరుగైంది. అలాగే మన జలాశయాల్లో (రిజర్వాయర్లలో) ప్రస్తుతం తగినంత నీటి నిల్వలు ఉన్నాయి. కాబట్టి ఈసారి వర్షాలు కాస్త తగ్గినా వరి లాంటి పంటలకు పెద్దగా నష్టం జరగకపోవచ్చు" అని ఒక అధికారి తెలిపారు.

కౌలు రైతులకు అలర్ట్: ఎరువుల కావాలంటే ఇలా చేయండి..
కౌలు రైతులకు అలర్ట్: ఎరువుల కావాలంటే ఇలా చేయండి..

కందిపప్పు కొరత వస్తే దిగుమతులే దిక్కు

భారతదేశంలో కందిపప్పుకు ఏడాదికి దాదాపు 45 లక్షల టన్నుల డిమాండ్ ఉంది. కానీ మన దేశంలో అంత పంట పండదు. అందుకే ఏటా విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్నాం. గత ఏడాది (2025-26)లో దేశంలో 35.9 లక్షల టన్నుల కంది పంట పండింది. అయితే ఈసారి ఎల్‌ నినో వల్ల కంది, సోయాబీన్ దిగుబడులు 50 నుంచి 60 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఒకవేళ పంట దిగుబడి తగ్గితే, మార్కెట్లో కొరత రాకుండా ఉండేందుకు ఎప్పటిలాగే విదేశాల నుండి దిగుమతులు చేసుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆ లోటును భర్తీ చేయనుంది.

'హిందూ మహాసముద్రం' కాపాడనుందా?

వర్షాల లోటును పూడ్చడానికి ప్రకృతిలోనే మరో అద్భుతమైన అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. జూలై చివరి నాటికి హిందూ మహాసముద్రంలో వచ్చే మార్పుల వల్ల 'పాజిటివ్ ఐఓడీ' (Positive IOD) ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ ఇది సానుకూలంగా మారితే, ఎల్‌ నినో ఉన్నప్పటికీ మన దేశంలోకి ఎక్కువ తేమతో కూడిన మేఘాలు వచ్చి మంచి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అయితే రుతుపవనాలు బలహీనపడితే జలాశయాల్లో నీరు తగ్గి, అది రాబోయే రబీ (శీతాకాలం) పంటల సాగుపై ప్రభావం చూపే ప్రమాదం కూడా లేకపోలేదు.

El Nino: 20 రాష్ట్రాల రైతులకు కేంద్రం అత్యవసర అలర్ట్!
El Nino: 20 రాష్ట్రాల రైతులకు కేంద్రం అత్యవసర అలర్ట్!

రైతులకు వాతావరణ శాఖ కీలక సూచనలు

తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలను ఎంచుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు. "ప్రభుత్వం ముందే హెచ్చరికలు ఇస్తున్నందున, రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మారాలి. తక్కువ నీటితో, తక్కువ రోజుల్లో పండే రకాలను విత్తుకోవడం ద్వారా ఎల్‌ నినో నష్టాల నుండి బయటపడవచ్చు" అని వాతావరణ కేంద్రం ప్రతినిధులు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+