మీ సవాల్ నిజమేనా? 24 గంటలు చాలు.. నేను నిరూపిస్తా : ఎలక్షన్ కమిషన్ తో కేజ్రీవాల్
పది రోజులు అక్కర్లేదని, 24 గంటలు చాలని, ఎలక్షన్ కమిషన్ కు చెందిన ఈవీఎంను ట్యాంపర్ చేయవచ్చని తాను నిరూపిస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: ఎవరైనా సరే.. పదిరోజులు టైం ఇస్తాం.. వీలైతే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని నిరూపించాలి.. అంటూ ఎన్నికల కమిషన్ సవాల్ విసిరినట్టు వచ్చిన వార్తలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
ఢిల్లీలోని ఈసీ కార్యాలయంలో ఈవీఎంలను 10 రోజుల పాటు అందుబాటులో ఉంచుతామని, టెక్కీలు, సైంటిస్టులు, ఇతరులెవరైనా వాటిని ట్యాంపర్ చేసి చూపాలని ఈసీ సవాల్ విసిరినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ సవాల్ లో భాగంగా ఈవీఎంలను ఎప్పటి నుంచి అందుబాటులో ఉంచుతారన్న విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఈసీ తెలిపినట్టు కూడా వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో "చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నుంచి అధికారిక స్టేట్ మెంట్ అంటూ వచ్చిన ఈ వార్త నిజమేనా?" అని ప్రశ్నించిన కేజ్రీవాల్.. తాను ఈ అంశంపై పూర్తి వివరాల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.
తనకు పది రోజులు అక్కర్లేదని, 24 గంటలు చాలని, ఎలక్షన్ కమిషన్ కు చెందిన ఈవీఎంను ట్యాంపర్ చేయవచ్చని తాను నిరూపిస్తానని స్వతహాగా ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications