కర్ణాటక బార్డర్స్ లో హై అలర్ట్, ఐదు రాష్ట్రాలు, ఆనంతపురం, చిత్తూరు జిల్లాల్లో !
బెంగళూరు/చిత్తూరు/హోసూరు: కర్ణాటకలో 224 అసెంబ్లీ ఎన్నికలకు మే 10వ తేదీన ఒకేసారి పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా సోమవారం సాయంత్రం 6 గంటలకు మద్యం విక్రయాలకు బ్రేక్ పడింది. పొరుగు రాష్ట్రాల నుంచి కర్ణాటకలోకి మద్యం తరలించకుండా ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేశారు.
కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న గోవాతో పాటు ఐదు రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రతో పాటు గోవా కూడా కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నాయి. ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎక్సైంజ్ శాఖ అధికారులతో ఎన్నికల అధికారులు మూడుసార్లు సమావేశం అయ్యారు. మీ రాష్ట్రాల నుంచి కర్ణాటకకు మద్యం సరఫరా కుండా చూడాలని ఎన్నికల అధికారులు అన్ని రాష్ట్రాల ఎక్సైంజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కర్ణాటక సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె, పుంగనూరు, బి, కొత్తకోట, బాగేపల్లి, చేలూరు పరిసర ప్రాంతాల్లో ఆంద్రప్రదేశ్ గ్రామాల నుంచి, అనంతపురం జిల్లాలోని బళ్లారి జిల్లా సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాల దగ్గర ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బెంగళూరు- చెన్నై హైవేలోని చెక్ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల మీదుగా కర్ణాటకలోని అక్రమంగా మద్యం తరలించకుండా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
కర్ణాటక- తమిళనాడులోని హోసూరులోని సిఫ్ కాట్, ఆనేకల్ బార్డర్, అత్తిబెలే తదితర ప్రాంతాల నుంచి అక్రమంగా కర్ణాటకలోకి మద్యం తరలించకుండా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కర్ణాటక-కేరళ సరిహద్దులోని కాసరగూడు నుంచి, మహారాష్ట్ర సరిహద్దులోని బెళగావి జిల్లాలోకి ఆ రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం తరలించకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా మద్యం విక్రయాలకు బ్రేక్ వేసిన ఎన్నికల అధికారులు బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లోని బార్ అండ్ రెస్టారెంట్లు, రిటైల్ వైన్ షాపులకు ఎన్నికల అధికారులు, ఎక్సైంజ్ శాఖ అధికారులు దగ్గర ఉండి మద్యం దుకాణాలకు తాళం వేసి సీల్ చేశారు.

మే 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి మే 11వ తేదీ ఉదయం 11 గంటల వరకు కర్ణాటక రాష్ట్రం మొత్తం మద్యం విక్రయాలు నిషేధించారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మద్యం బాటిల్స్ సరఫరా చెయ్యడం నిషేధించారు. మే 13వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో మే 12వ తేదీ రాత్రి నుంచి మే 14వ తేదీ వరకు కూడా మద్యం విక్రయాలను నిషేధించారు. మొత్తం మీద కర్ణాటక సరిహద్దులోని గోవాతో పాటు ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో ఎన్నికల అధికారులు ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications