ఫేమస్ నటి మామకు షాక్ ఇచ్చిన అధికారులు, ఎన్ని లీటర్ల లిక్కర్ అంటే, అసలు మ్యాటర్ తో!
కన్నడ చెలువిన చిత్తర నటి, శ్యాండిల్ వుడ్ ను ఓ ఊపుఊపేసిన హీరోయిన్ అమూల్యకు మామ, బీజేపీ నాయకుడికి ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. నటి అమూల్య మామ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రముఖ నటి అమూల్య మామ ఇంటిలో అధికారులు మధ్యం స్వాధీనం చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
శ్యాండిల్‌వుడ్ నటి అమూల్య మామ, బీజేపీ నేత, బీబీఎంపీ మాజీ కార్పోరేటర్ రామచంద్ర నివాసంపై ఎన్నికల అధికారులు రాత్రి సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో అక్రమంగా నిల్వ ఉంచిన 30 లీటర్లకు పైగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 30 మంది అధికారుల బృందం ఒక్కసారిగా బీజేపీ నాయకుడు రామచంద్ర ఇంటిలో సోదాలు చేశారు. ఎన్నికల అధికారులు బీజేపీ నాయకుడు రామయంద్ర ఇంట్లో సోదాలు చేయగా అక్రమ వస్తువులు, నగదు దొరికాయని సమాచారం.

ఎన్నికల అధికారులు భారీగా మద్యం సీసాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ దాడి వెనుక కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం హస్తం ఉందని బీజేపీ నాయకుడు రామచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ నాయకుడు రామచంద్ర ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు మా ఇంటి చుట్టూ ఓటర్లకు డబ్బులు పంచారని, దానిని నేను అడ్డుకున్నానని రామచంద్ర ఆరోపించారు.
కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతున్న సమయంలో దానిని నేను అడ్డుకున్నానని, కాంగ్రెస్ నాయకుల తీరుకు తాను అభ్యంతరం చెప్పానని కోపంతో తన మీద పగ తీర్చుకోవడానికి తన ఇంటి మీదకు పోలీసులను పంపించారని రామచంద్ర ఆరోపించారు. ఎన్నికల అధికారుల దాడి సమయంలో మా ఇంటి దగ్గర ఉన్న పోలీసు కానిస్టేబుల్ కు ఫోన్ చేశారని, ఒకసారి కాల్ రిసీవ్ చేసుకున్న కానిస్టేబుల్ తో వాడిని రెండు రోజులు లోపల వెయ్యాలని అవతలి వ్యక్తి చెప్పాడని బీజేపీ నాయకుడు రామచంద్ర ఆరోపించారు.

మాఇంటిలో మనువళ్ల పుట్టినరోజు జరుపుకోవడానకి తాను మద్యం కొనుగోలు చేశానని బీజేపీ నాయకుడు రామచంద్ర మీడియాకు చెప్పారు. నా మనవళ్ల పుట్టినరోజు కాబట్టి నేను మా ఇంటికి మద్యం తెచ్చానని, కానీ ఏ దురుద్దేశంతో తాను ఇంటిలో మద్యం నిల్వ ఉంచలేదని అన్నారు. లోక్ సభ ఎన్నిక ప్రవర్తనా నియమావళి కారణంగా మా మనవళ్లకు గ్రాండ్ గా బర్త్ డే పార్టీ పెట్టకూడదని భావించానని, సాధారణంగా బర్త్ డే వేడుకలను నిర్వహించాలని మా కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారని, అప్పటికే తన మీద పగతో దాడి చేశారని రామచంద్ర ఆరోపించారు.
మా ఏరియాలో బీజేపీకి భారీ మెజారిటీ వస్తుందని కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేక ఎన్నికల అధికారులను రెచ్చగొట్టి తన ఇంటిపై దాడి చేయించారని, దీని వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని బీజేపీ నాయకుడు రామచంద్ర పరోక్షంగా మండిపడ్డారు. మొత్తం మీద శ్యాండిల్ వుడ్ హీరోయిన్ అమూల్యా మామ, బీజేపీ నాయకుడు రామచంద్ర ఇంటిపై ఎన్నికల అధికారులు దాడులు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ నాయకులు మాత్రం స్పందించలేదు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications