Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇంటికి కరెంట్ ఇవ్వడానికి వచ్చిన లైన్ మెన్ కు అసలైన కరెంట్ ఇచ్చిన భార్య !

వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. కొడుకు పుట్టిన తరువాత విద్యుత్ శాఖ లైన్ మ్యాన్ తో భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. భార్య మ్యాటర్ తెలుసుకున్న భర్త ఆమె బుద్ది మార్చలేక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి కోసం భర్త ఆత్మహత్యకు కారణం అయిన కిలాడీ లేడీ ఇప్పుడు హత్యకు గురైయ్యింది.

కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని కోళ్లేగాలలోని ఆదర్శ నగర్ లో రేఖా (36) అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన రవి అనే వ్యక్తిని రేఖా పెళ్లి చేసుకుంది. భర్త రవితో సంతోషంగా కాపురం చేసిన రేఖాకు కొడుకు పుట్టాడు. కుమారుడు పుట్టిన తరువాత రేఖాకు కర్ణాటక విద్యుత్ శాఖలో పని చేస్తున్న నాగేంద్ర అలియాస్ ఆనంద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.

 Electricity department linemen who killed a woman who had an illicit relationship and kidnapped her son near Mysuru

ఇంటికి కరెంట్ ఇవ్వడానికి వచ్చిన నాగేంద్రకు రేఖా అసలైన కరెంట్ ఇచ్చింది. తన వయ్యారాలతో విద్యుత్ శాఖ లైన్ మెన్ నాగేంద్రను రేఖా వలలో వేసుకుంది. ప్రియుడు నాగేంద్రతో ఎంజాయ్ చేస్తున్న రేఖా ఆమె భర్త రవిని, కొడుకును మరిచిపోయింది. నాగేంద్రతో అక్రమ సంబంధం పెట్టుకున్న రేఖా ప్రియుడితో ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ విచ్చలవిడిగా తయారై భర్త రవిని పూర్తిగా నిర్లక్షం చేసింది.

 Electricity department linemen who killed a woman who had an illicit relationship and kidnapped her son near Mysuru

భార్య రేఖాను పద్దతి మార్చుకోవాలని రవి పదేపదే చెప్పాడు. అయితే భర్త మాటలను ఏమాత్రం పట్టించుకోని రేఖా ప్రియుడు నాగేంద్రతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తూ జల్సాలు చేసింది. భార్య చెప్పిన మాట వినలేదని ఆవేదనతో కుమిలిపోయిన రవి రెండు సంవత్సరాల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త రవి ఆత్మహత్య చేసుకున్నాడని ఏమాత్రం ఫీలింగ్ లేకుండా ప్రియుడు నాగేంద్రతో రేఖా ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతోంది.

ప్రియుడు నాగేంద్రను ఇంటికే పిలిపించుకుని ఎంజాయ్ చేస్తున్న రేఖా ఇప్పుడు ఆదర్శనగర్ లోని ఇంటిలో శవమై కనిపించింది. రేఖా ఇంట్లో శవమై కనిపించడంతో ఆమె కొడుకు కనపడకుండా పోయాడు. రేఖా శవమై కనిపించిన తరువాత ఆమె ప్రియుడు నాగేంద్ర కూడా పరారైనాడు రేఖా జీవితం నాశనం చేసి ఆమె భర్త రవి ఆత్మహత్యకు కారణం అయిన లైన్ మెన్ నాగేంద్ర ఇప్పుడు బాలుడిని కూడా కిడ్నాప్ చేశాడని, రేఖాను హత్య చేసి తప్పించుకున్నాడని రేఖా కుటుంబ సభ్యులు కోళ్లేగాళ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. లైన్ మెన్ నాగేంద్ర కనపడటం లేదని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+