ఏనుగమ్మ.. ఏనుగు.. ఓటేయడానికి వచ్చావా ???
పశ్చిమ బెంగాల్‌లోని ఝార్గ్రామ్లో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ జరుగుతుండగా ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం సమీపంలోకి ఒక ఏనుగు ప్రవేశించడంతో ఓటర్లు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే స్థానికులు ఇందుకు సంబంధించిన దృశ్యాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సదరు క్లిప్పింగ్స్ వైరల్ గా మారుతున్నాయి.
స్థానికంగా "రామ్‌లాల్" అని పిలవబడే ఈ ఏనుగు.. ప్రజలు ఓటు వేయడానికి గుమిగూడుతున్న సమయంలోనే పోలింగ్ బూత్ దగ్గరకు చేరుకుంది. అది బయట పార్క్ చేసి ఉన్న ఒక వస్తువుల వాహనం వద్దకు వెళ్లి, కొద్దిసేపు అక్కడే నిలిచి, ఎవరికీ ఎటువంటి హానీ తలపెట్టకుండానే ముందుకు కదిలింది.

ఊహించని ఈ దృశ్యం ప్రజలను ఆకర్షించడంతో, పోలింగ్ కేంద్రం వద్ద కొంతసేపు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతంలో ఏనుగు కదలికల సమాచారం అందుకున్న లోధాశులి పరిధి అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఆ ఏనుగును సురక్షిత ప్రాంతానికి మళ్లించారు.
ఈ ప్రాంతంలో ఏనుగుల కదలికలను నియంత్ర్రించడానికి చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా అటువంటి సంఘటనలను పర్యవేక్షించడానికి 'ఐరావత్' వాహనంతో కూడిన 15 మంది సభ్యుల ప్రత్యేక బృందం, ఎలిఫెంట్ ట్రెక్కర్స్ టీమ్‌తో కూడిన త్వరిత స్పందన యూనిట్‌ను మోహరించినట్టు స్పష్టం చేశారు. మరోవైపు ఓటింగ్ వేసేందుకు ఇంకా పోలింగ్ బూత్ ల వద్దకు క్యూ కడుతున్నారు.
VIDEO | West Bengal Polls: An elephant entered the area near the polling station at Jitusol Primary School in Jhargram.
— Press Trust of India (@PTI_News) April 23, 2026
(Source: Third Party)#AssemblyPollsWithPTI #WestBengalPollsWithPTI
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/UN6axPscmO












Click it and Unblock the Notifications