హృదయాలను గెలిచిన సన్నివేశం: దేశ విభజన తర్వాత 74 ఏళ్లకు కలిసిన సోదరులు (వీడియో)
న్యూఢిల్లీ: దేశ విభజన సమయంలో విడిపోయిన ఇద్దరు సోదరులు 74 ఏళ్ల తర్వాత కలుసుకుని భావోద్వేగానికి గురైన ఘటన ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. 1947లో భారతదేశం విభజన జరిగినప్పుడు మహమ్మద్ సిక్కిక్ పసివాడు. దేశంతోపాటు అతని కుటుంబం విడిపోయింది.
అతని అన్న హబీబ్ అలియాస్ షేలా విభజన రేఖకు భారతదేశం వైపు పెరిగాడు. ఇప్పుడు అంటే 74 సంవత్సరాల తర్వాత, పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను భారత్‌తో కలిపే కర్తార్‌పూర్ కారిడార్ సోదరులను తిరిగి కలిపేసింది.

భావోద్వేగాలతో కూడిన తోబుట్టువుల కలయిక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హృదయాలను గెలుచుకుంటోంది. పాకిస్థాన్‌లోని ఫైస్లాబాద్‌లో సిద్ధిక్ నివసిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. షేలా అతని అన్నయ్య భారతదేశంలోని పంజాబ్‌లో నివసిస్తున్నాడు.
Brothers meet after 74 years because of 1947! #pakistan #punjab
— Manpreet Singh (@mjassal) January 12, 2022
(I admit, I cried) pic.twitter.com/NddUYBHK09
సరిహద్దు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్తాపూర్ వరకు భారతదేశం నుంచి పాకిస్తాన్‌కు వీసా రహిత ప్రయాణాన్ని సులభతరం చేయడానికి కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించినందుకు రెండు దేశాల ప్రభుత్వాలకు ఈ సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీసా లేని విధానం నవంబర్ 2019లో అమలులోకి వచ్చింది.
After a long time, I watched something that really made me a little emotional. Two brothers, one from India's Punjab and the other from Pakistan's Punjab, met in Kartarpur 74 years after they were separated. pic.twitter.com/AIlfPpDEPy
— Roohan Ahmed (@Roohan_Ahmed) January 12, 2022
-
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!











Click it and Unblock the Notifications