వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మ బ్రతికి ఉంటే ఈ రోజు ? కన్నీటి పర్యంతమైన శశికళ

|
Google Oneindia TeluguNews

చెన్నై: అమ్మే (జయలలిత) గనుక బ్రతికి ఉంటే ఈ రోజు తప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చేవారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి నెచ్చెలి శశికళ కన్నీటి పర్యంతమయ్యారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న శశికళ కన్నీరు పెట్టుకున్నారు.

<strong>నెచ్చెలి శశికళతో జాగ్రత్త: బీజేపీ హై కమాండ్, లాభం కోసం!</strong>నెచ్చెలి శశికళతో జాగ్రత్త: బీజేపీ హై కమాండ్, లాభం కోసం!

ఇండియా టుడే ఆధ్వర్యంలో సౌత్ కాన్ క్లేవ్ ( దక్షిణ భారత సదస్సు -2017) సందర్బంగా ఏర్పాటు చేసిన జయలలిత ఫోటో ఎగ్జిబిషన్ ను నెచ్చెలి శశికళ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైనారు.

వేదిక మీద ఉన్న శశికళ నటరాజన్ జయలలితను తలచుకుంటు కన్నీళ్లు తుడుచుకుంటా కనిపించారు. డిసెంబర్ 31వ తేది అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టిన శశికళ సోమవారం తొలిసారిగా ప్రజల ముందుకు వచ్చారు.

Emotional Sasikala unveils Jayalalithaa photo exhibition in Chennai

<strong>నో డౌట్; నేను ఉన్నంతవరకు అది జరగదు: శశికళ</strong>నో డౌట్; నేను ఉన్నంతవరకు అది జరగదు: శశికళ

ఇండియా టుడే ఏర్పాటు చేసిన కాన్ క్లేవ్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సైతం పాల్గొన్నారు. ఈ సందర్బంగా పన్నీర్ సెల్వం తన గురువు జయలలితను తలుచుకుని మాట్లాడారు.

తమిళనాడు రాష్ట్రంలో అమ్మ ప్రారంభించిన అన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే జయలలిత (అమ్మ) కలలను సాకారం చేసేందుకు మిషన్ 2023 కార్యక్రమాన్ని ప్రారంభించామని పన్నీర్ సెల్వం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలతో పాటు, మంత్రులు జయలలిత సేవలను కొనియాడారు.

English summary
Emotional AIADMK General Secretary Sasikala Natarajan unveils Jayalalithaa photo exhibition in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X