వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Cooker bomb: ట్విస్ట్, ఇంజనీరింగ్ స్టూడెంట్ అందర్, తండ్రి పొలిటీషియన్, తల్లి లెక్చరర్, ఎన్ఐఏ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ఉడిపి: కర్ణాటకలోని శివమొగ్గలో జరిగిన ట్రయల్‌ బాంబు పేలుడు, మంగళూరు కుక్కర్‌ బాంబు పేలుళ్ల కేసుల్లో ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. మజ్ మునీర్ అనే అనుమానిత ఉగ్రవాది షరీక్ రూమ్‌మేట్ అయిన రోషన్ షేక్‌ను ఎన్‌ఐఏ కస్టడీలోకి తీసుకుంది.

ఉడిపికి చెందిన రోషన్ మంగళూరులో ఓకాలేజ్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కుక్కర్ బాంబు పేలుడుకు సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి అరెస్టు కావడం కలకలం రేపింది. రోషన్ తండ్రి ప్రముఖ రాజకీయ పార్టీలో నాయకుడిగా పని చేస్తున్నారు. రోషన్ తల్లి ప్రభుత్వ కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తోందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

Wife: ఫ్రెడ్ భార్య అశ్లీల వీడియో తీసి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసిన పోలీసులు, వీడియో ఎలా తీశాడు ?Wife: ఫ్రెడ్ భార్య అశ్లీల వీడియో తీసి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసిన పోలీసులు, వీడియో ఎలా తీశాడు ?

కాలేజీలో అదుపులోకి తీసుకున్న అధికారులు

కాలేజీలో అదుపులోకి తీసుకున్న అధికారులు

ఎన్ఐఏ అధికారులు కళాశాలపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. బ్రహ్మావర్ తాలూకాలోని వరంపల్లిలోని మీనా అన్మోల్ అపార్ట్‌మెంట్‌లో రోషన్ అతని కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడని, ఎన్‌ఐఎ అధికారులు రేషన్ ఇంటి నుండి అనేక పత్రాలను, ల్యాప్‌టాప్, మొబైల్, హార్డ్ డిస్క్, బ్యాంకు సమాచారం, పాస్‌పోర్టు, చిరునామాల రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

తండ్రి రాజకీయ నాయకుడు

తండ్రి రాజకీయ నాయకుడు

రోషన్ షేక్ బ్రహ్మావర్ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తాజుద్దీన్ షేక్ కుమారుడని, కాంగ్రెస్ నేత కుమారుడికి అనుమానిత ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ విమర్శించింది. మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో తాజావుద్దీన్‌ షేక్‌కు సత్సంబంధాలు ఉన్నాయని, కాంగ్రెస్‌ పార్టీ కార్యకలాపాల్లో అతను చురుగ్గా వ్యవహరిస్తున్నారని ఉడిపి బీజేపీ ఎమ్మెల్యే రఘపతి భట్ ఆరోపించారు.

సిద్దరామయ్య, డీకేశీ ఏం చెబుతారు ?

సిద్దరామయ్య, డీకేశీ ఏం చెబుతారు ?

అనుమానిత ఉగ్రవాది రోషన్ తండ్రి తాజుద్దీన్, కాంగ్రెస్ నేతల మధ్య సంబంధాల నేపథ్యంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్, ఖాదర్‌లతో కలిసి తాజుద్దీన్ ఉన్న ఫొటోను ఉడిపి బీజేపీ ఎమ్మెల్యే రఘుపతి భట్ విడుదల చేశారు. ఎమ్మెల్యే రఘుపతి భట్ స్పందిస్తూ రోషన్‌ తండ్రి తాజుద్దీన్‌ బ్లాక్‌ కాంగ్రెస్‌లో చురుకైన కార్యకర్త, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌, యూటీ ఖాదర్‌ కూడా చాలా సన్నిహితుడు, దీనిపై రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు స్పష్టత ఇవ్వాలి, దీనికి కాంగ్రెస్‌ పార్టీ బాధ్యత వహించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘపతి భట్ డిమాండ్ చేశారు.

తల్లి ప్రభుత్వ కాలేజ్ లెక్చరర్

తల్లి ప్రభుత్వ కాలేజ్ లెక్చరర్

ఇకనైనా తాజుద్దీన్ ను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి నుంచి గద్దె దించుతారా? లేదా ఆ పార్టీ నాయకులే నిర్ణయం తీసుకోవాలని రఘపతి భట్ అన్నారు. ఇదే సమయంలో ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నేతలతో కలిసి తీసుకున్న ఫొటోలను విడుదల చేశారు. రోష‌న్ కుటుంబాన్ని కూడా విచారించాలి. రేషన్ తల్లి ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్. ఆమెపై విద్యాశాఖ మంత్రి నగేష్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని రఘపతి భట్ అన్నారు.

ఇంకా ఏం చెయ్యాలని అనుకుంటున్నారు ?

ఇంకా ఏం చెయ్యాలని అనుకుంటున్నారు ?

తాజుద్దీన్ జాతీయవాదానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. రోషన్ తల్లి కాలేజీకి వ్యతిరేకంగా చేసిన ప్రకటనల ఆడియోలను మంత్రి నాగేష్ కు అందిస్తామని రఘుపతి భట్ అన్నారు. తాజుద్దీన్ ఆర్థిక పరిస్థితి అంతకుముందే దిగజారిందని, అందుకే ఉగ్రవాదులతో చేతులు కలపడానికి ప్రయత్నించారని ఉడిపి ఎమ్మెల్యే రఘుపతి భట్ ఆరోపించారు

English summary
Cooker bomb: Engineering college student arrested in Mangaluru cooker bomb blast case, student's father is a politician, mother is a lecturer in a government college
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X