క్లాస్‌రూంలో ఉరేసుకుని ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

కోల్‌కతా: ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థి తన తరగతి గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాధ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుగ్లీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి(24) బుధవారం మధ్యాహ్నం తరగతిలో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

గమనించిన తోటి విద్యార్థులు కళాశాల సిబ్బందికి సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. ప్రేమ విఫలం కావడంతో తాను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు, తన చావుకు ఎవరూ కారణం కాదని అందులో పేర్కొన్నాడని పోలీసులు చెప్పారు.

కోల్‌కతా

బుధవారం సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడి తండ్రి రోజూ కూలీగా పని చేస్తున్నాడు. ఆమె తల్లి కూడా పలు ఇళ్లల్లో పని మనిషిగా చేస్తోంది. మృతుడికి ఒక సోదరుడు ఉన్నాడు.

స్వాతంత్ర్య సమరయోధురాలు పెరిన్ రోమేశ్ చంద్ర మృతి

ముంబై: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు పెరిన్ రోమేశ్ చంద్ర ఇవాళ తుదిశ్వాస విడిచారు. దీర్ఘ కాలిక అనారోగ్యంతో బాధపడుతున్న 96 ఏళ్ల పెరిన్ గురువారం ముంబైలో మృతి చెందారు. పెరిన్ కోరిక మేరకు ఆమె మృతదేహాన్ని గ్రాంట్ మెడికల్ కాలేజీకి దానం చేస్తున్నట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు.

పెరిన్ అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ లీడర్‌షిప్‌లో భాగంగా కమ్యూనిజంలో జరిగిన శాంతి ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. మాజీ ప్రధాని ఐకె గుజ్రాల్‌కు సన్నిహితురాలిగా ఉండేవారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+