ఎమ్మెల్యేకు షాక్: ఫేక్ అకౌంట్లతో మహిళలకు మేసేజ్‌లు, చివరికిలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: మహరాష్ట్రకు చెందిన ఎన్‌సిపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాహద్‌‌కు ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ చుక్కలు చూపించాడు.ఎమ్మెల్యే పేరు మీద సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మహిళలకు సందేశాలు పంపాడు. ఆఖరికి ఎమ్మెల్యే సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో ఇంజనీరింగ్ స్టూడెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో ఫేక్‌ అకౌంట్లను క్రియేట్‌ చేయటం.. సెలబ్రిటీలను ఇబ్బందుల పాలు చేయటం... తరచూ చూస్తున్నదే. అయితే ఇక్కడ ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మాత్రం మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించాడు.

Engineering student impersonates NCP MLA Jitendra Awhad on social media platforms, arrested

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జితేంద్ర అవాహద్‌ పేరుతో ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మహిళలకు సందేశాలు పంపేవాడు. . మహిళలతో గంటల తరబడి ఫోన్లలో మాట్లాడటమే కాదు.. వారిని డిన్నర్‌ లకు రావాల్సిందిగా ఆహ్వానించేవాడు. మరి కొందరు ఏకంగా అవాహద్‌ ఆఫీస్‌కే వచ్చేయటంతో ఆయనకు అసలు విషయం అర్థం అయ్యింది.

దీంతో వెంటనే ఆయన సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అయితే అప్రమత్తమైన ఆ నిందితుడు.. ఆ ఆకౌంట్లను బ్లాక్ చేసేశాడు. కానీ, అది కొద్ది కాలం మాత్రమే. తిరిగి మళ్లీ ఈ మధ్యే మళ్లీ కొత్త అకౌంట్లు క్రియేట్ చేసి మళ్లీ మహిళలకు మెసేజ్‌లు పంపటం ప్రారంభించాడు.

ఈసారి మాత్రం థానే పోలీసులే ముందున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా అతగాడిని పట్టేసుకున్నారు. తాను సందేశాలు పంపుతుంటే వారిచ్చే సమాధానాలను ఆస్వాదించేవాడినని ఆ యువకుడు చెప్పటం విశేషం. ఆ యువకుడి పెరేంట్స్ విదేశాల్లో ఉండగా.. బంధువుల వద్ద ఉంటూ ముంబైలోని ఓ టాప్‌ కాలేజీలో ఇంజనీరింగ్‌ విద్యనభ్యసిస్తున్నాడని పోలీసులు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Thane cyber police has arrested an engineering student for allegedly impersonating NCP MLA and senior leader Jitendra Awhad on social media. After the accused was taken into custody, he confessed to the crime and said that he got a huge response from women and was enjoying it.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి