ఈ అర్ధరాత్రి నుంచి కంప్లీట్ లాక్‌డౌన్.. ప్రధాని మోదీ సంచలన పిలపు.. ఏప్రిల్ 14 వరకు అన్నీ బంద్..

కరోనా మహమ్మారి మన దేశంలో ఘోరకలి సృష్టించకముందే జాగరూకులై వ్యవహరిద్దామని ప్రధాని నరేంద్ర మోదీ జాతి జనులకు పిలుపునిచ్చారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించారు. మొత్తం 21 రోజులపాటు, అంటే ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని చెప్పారు. జనతా కర్ఫ్యూ స్ఫూర్తితోనే ప్రజలంతా 21 రోజుల లాక్ డౌన్ కు కూడా సహకరించాలని ఆయన కోరారు.

 ధీమాగా పోరాడుదాం..

ధీమాగా పోరాడుదాం..

కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం, మంగళవారం నాటికి రోగుల సంఖ్య దాదాపు 500కు చేరిన నేపథ్యంలో అత్యయిక పరిస్థితి తప్పదని కేంద్రం భావించింది. దీనిపై మంగళవారం రాత్రి ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని, ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, కొంచెం కష్టమే అయినా గడ్డు కాలాన్ని ఎదురించడానికి జాగ్రత్తలు తప్పనిసరి అని ప్రధాని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలే బేలచూపులు చూస్తున్నవేళ.. భారత్ తనదైన పట్టుదలతో కరోనా సవాలును ధీటుగా ఎదుర్కొంటుందని, అది ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుందని ఆయన చెప్పారు.

 వచ్చే 21 రోజులు చాలా కీలకం..

వచ్చే 21 రోజులు చాలా కీలకం..


‘‘ఈ రోజు(మంగళవారం) అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశం మొత్తం పూర్తిగా లాక్ డౌన్ అయిపోతుంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడం పూర్తిగా నిషేధం. మహానగరాలు మొదలుకొని మారుమూల పల్లెలల దాకా వీధివీధి, వాడవాలా ఈ ఉత్తర్వులులో ఉంటాయని గుర్తుంచుకోండి. ఒకరకంగా చెప్పాలంటే ఇది కర్ఫ్యూ తరహా వాతావరణమే కాబట్టి అందదరూ సహకరించాలి. కరోనా కట్టడికి 21 రోజులు కావాలని నిపుణులు చెబుతున్నారు. ఆ 21 రోజులు మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ ను అదుపుచేయగలుగుతాం. లేదంటే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదముంది. కాబట్టి వచ్చే 21 రోజులను ప్రతి ఒక్కరూ కీలకంగా తీసుకోండి.. ఇంటి గడపనే లక్షణరేఖగా భావించి, బయటకు రాకండి''అని మోదీ అన్నారు.

కొట్టమని చెప్పడం లేదు కానీ..

కొట్టమని చెప్పడం లేదు కానీ..

హెల్త్ కేర్ కోసం రూ.15వేల కోట్లు..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో హెల్త్ కేర్ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. వైరాలజీ ల్యాబ్స్ విస్తరణతోపాటు వైద్య సిబ్బంది ధరించే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్వీప్ మెంట్(పీపీఈ), కొత్తగా ఐసీయూ విభాగాలు, వెంటిలేటర్ల ఏర్పాటు, మెడికల్ సిబ్బంది శిక్షణ తదితర అవసరాల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ప్రైవేటు భాగస్వామ్యం..

ప్రైవేటు భాగస్వామ్యం..

ఇప్పటిదాకా కరోనాపై పోరు ప్రధానింగా ప్రభుత్వ ఆస్పత్రులు లేదా ప్రభుత్వ వ్యవస్థల ద్వారానే సాగిన సంగతి తెలిసిందే. ఇకపై ఇందులోకి ప్రైవేటు రంగానికి కూడా భాగస్వామ్యం కల్పిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ‘‘కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభం సమయంలో ప్రైవైటు రంగం కూడా తన వంతు భారాన్ని పంచుకోడానికి ముందుకు రావడం సంతోషం. ఇకపై ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రైవేటు ల్యాబ్స్ కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాయి.

పుకార్లు నమ్మొద్దు.. మెడిసిన్ అలా వాడొద్దు..

పుకార్లు నమ్మొద్దు.. మెడిసిన్ అలా వాడొద్దు..

కరోనా వ్యాప్తి నిరోధంపైనే పూర్తి ఫోకస్ పెట్టాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. కరోనా గురించి పుకార్లుగానీ, వ్యాధిపై మూఢనమ్మకాలనుగానీ విశ్వసించొద్దని చెప్పారు. ఇబ్బందులు తలెత్తినప్పుడు డాక్టర్లను సంప్రదించకుండా ఏదిపడితే ఆ మెడిసిన్ వాడొద్దని సూచించారు. సవాళ్లను ఎదుర్కొనే సమయంలో అందరం సంఘటితంగా, భద్రంగా ఉందామని ప్రధాని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+