తాగుబోతులైన భర్తలు.. ఒకర్నొకరు పెళ్లిచేసుకున్న భార్యలు
మనం ఎన్నో రకాల పెళ్లిళ్లు చూసుంటాం. యువతిని యువకుడు పెళ్లిచేసుకోవడం, ఇద్దరు యువతులు ఒకర్నొకరు వివాహమాడటం, ఇద్దరు అబ్బాయిలు ఒకర్నొకరు పెళ్లి చేసుకోవడం, యువతి తనను తానే వివాహం చేసుకోవడం.. ఇలా చాలా రకాల పెళ్లిళ్లు చూశాం. కానీ ఇలాంటి అరుదైన వివాహాన్ని మాత్రం ఎక్కడా చూసుండరు. మొగుళ్లతో విసిగిపోయిన ఇద్దరు వివాహితలు.. ఒకర్నొకరు పెళ్లిచేసుకుని అందరినీ షాక్ కు గురి చేశారు. ఈ అరుదైన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో జరిగింది.
ఇన్ స్టాలో పరిచయం
యూపీలోని గోరఖ్ పూర్ కు చెందిన కవిత, గుంజా అలియాస్ బబ్లూ అనే ఇద్దరు వివాహితలు ఒకరికొకరు ఇన్ స్టా వేదికగా పరిచయం అయ్యారు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఆరేళ్లపాటు కలిసి జీవించారు. ఆ తర్వాత తాజాగా గోరఖ్ పూర్ లోని ఛోటాకాశీ గా పిలవబడే శివాలయంలో వీళ్లు పెళ్లి చేసుకున్నారు. గుంజా అలియాస్ బబ్లూ కవిత నుదిటిపై తిలకం దిద్దగా.. ఒకరికొకరు పూలదండలు మార్చుకున్నారు. ఆ తర్వాత అగ్నిగుండం చుట్టూ ఏడడుగులు నడిచారు.

అందుకే పెళ్లిచేసుకున్నాం..
అందులో ఓ వివాహిత మాట్లాడుతూ.. "నాకు ఇదివరకే వివాహం అయింది. నా భర్త మద్యానికి బానిసై రోజూ నన్న వేధించేవాడు. నాకు నలుగురు పిల్లలు. భర్త వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాను." అని తెలిపింది. మరో మహిళ మాట్లాడుతూ.. నా భర్త కూడా మద్యానికి బానిసై నన్ను వేధించసాగాడు. లేనిపోని సంబంధాలు అంటగట్టి హింసించేవాడు. అందుకే అతడ్ని వదిలేసాను. అని పేర్కొంది. "మేమిద్దరం మా భర్తల వల్ల ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మేమిద్దరం ఒకర్నొకరు వివాహం చేసుకొని.. ఏదో ఒక పని చేసుకుంటూ ప్రశాంతంగా ఉండాలని నిశ్చయించుకున్నాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని గుంజా అలియాస్ బబ్లూ మీడియాకు తెలిపింది.












Click it and Unblock the Notifications