రైలు ప్రయాణికులకు గమనిక: తాజా గైడ్ లైన్స్

దీపావళి సమీపించినందున రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికుల కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. పండగ రద్దీ సమయంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ గైడ్ లైన్స్ జారీ అయ్యాయి. కొన్ని రకాల వస్తువులను రైలులో తీసుకువెళ్లవద్దని రైల్వే సూచించింది. ప్రమాదాలను నివారించడం, పండుగ రద్దీ ఎటువంటి అవాంతరాలకు తావివ్వకుండా కూడదనే ఉద్దేశంతో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది.

దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సందడి నెలకొంది. లక్షలాది మంది ప్రయాణికులు రైలులో సుదూర ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. దీపావళి, ఇతర వేడుకలు సమీపిస్తున్నందున, రైలు ప్రయాణం సురక్షితంగా, అవాంతరాలు లేకుండా ఉండటానికి రైల్వే మెరుగైన భద్రతా చర్యలను ప్రవేశపెట్టింది. రైలులో ప్రయాణికులు తమ వెంట ఆరు వస్తువులను తీసుకువెళ్లకూడదు.

Essential Travel Tips 6 Items to Leave Behind on Your Train Journey This Diwali

టపాసులు, కిరోసిన్, గ్యాస్ సిలిండర్లు, స్టవ్, అగ్గిపెట్టెలు, సిగరెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రైలులో తీసుకెళ్లడానికి ప్రయాణికులకు అనుమతి లేదు. వీటితో పాటు మండే స్వభావం గల వస్తువుల, పేలుడు పదార్థాలతో రైలు ఎక్కకూడదు. బోగీల్లో ప్రయాణికుల సంఖ్య, గాలి ప్రసరణ పరిమితంగా ఉండటం వల్ల చిన్న నిప్పు రవ్వ కూడా భారీ ప్రమాదానికి దారితీసే అవకాశాలు లేకపోలేదు.

సీట్లు, బోగీల్లో ఉండే ఇతర వస్తువులకు మంటలు త్వరగా అంటుకుంటాయని, అగ్నికీలలు వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమౌతాయి. సీట్ల పైభాగంలో ఉండే రెగ్జిన్, కుషన్, అదులో ఉండే స్పాంజ్ లేదా ఇతర వస్తువులు త్వరగా మంటల బారిన పడేవి కావడం వల్ల నిషేధిత వస్తువుల్లో ఏ ఒక్కదాన్ని కూడా ప్రయాణికులు తమ వెంట రైళ్లల్లో తీసుకెళ్లకూడదని రైల్వే అధికారులు ఆదేశించారు.

దీపావళి, ఛాత్ వంటి పండుగల వల్ల రైళ్లు, రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫారాలపై ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుందని, వారు తమ వెంట తెచ్చుకునే లగేజీ వల్ల ప్రతి బోగీ కూడా సాధారణం కంటే మరింత ఇరుకుగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న నిప్పురవ్వ కూడా అగ్నిప్రమాదానికి దారి తీస్తుందని హెచ్చరించారు.

  • ఏవైనా అనుమానాస్పద వస్తువులు, బాణాసంచా, మండే స్వభావం పరికరాలు రైళ్లు, ప్లాట్ ఫామ్ లపై కనిపిస్తే వెంటనే ఆర్పీఎఫ్/జీఆర్పీ/ రైల్వే సిబ్బందిని తెలియజేయాలి.
  • విలువైన వస్తువులను దగ్గరగా లేదా కనిపించేలా ఉంచుకోవాలి. ప్రత్యేకించి రద్దీగా ఉండే బోగీల్లో అన్నింటినీ దిగువ ర్యాక్‌లలో పెట్టవద్దు.
  • సాధ్యమైనంత వరకు తక్కువ లగేజీతో ప్రయాణించాలి. అధిక లగేజీ తోటి ప్రయాణికులను అసౌకర్యానికి గురి చేస్తుంది.
  • పండగ రద్దీ సమయంలో డిజిటల్ పేమెంట్స్ మీద ఆధారపడటం మంచిది. పెద్ద మొత్తంలో నగదును తీసుకెళ్లడం వల్ల అవి చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డులు, మొబైల్ ద్వారా పేమెంట్స్ చేయాలి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+