చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Estate: జయలలిత కొడనాడు ఎస్టేట్ కేసులో ట్విస్ట్, ఎవ్వరూ ఎక్కడికి వెళ్లకూడదు, సీబీసీఐడీ ఆర్డర్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/నీలగిరి: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ లో జరిగిన హత్య, దోపిడీ కేసు వేగవంతం అయ్యింది. కొడనాడు ఎస్టేట్ మేనేజర్, క్యాషియర్, అకౌంటెంట్ తదితరులను విచారణ చేసిన సీబీసీఐడీ అధికారులు వాళ్లు ఆ ప్రాంతం వదిలి వెళ్లకూడదని, విదేశాలకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఎంతో ఇష్టం అయిన కొడనాడు ఎస్టేట్ లో హత్య, దోపిడీ జరగడం అప్పట్లో కలకలం రేపింది. రెండు రోజుల పాటు అనేక మందిని విచారణ చేసిన సీబీసీఐడీ అధికారులు అనేక సమాచారం సేకరించిందని వెలుగు చూసింది. ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జయలలిత సొంత ఎస్టేట్ కేసు విచారణ వేగవంతం కావడంతో అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

జయలలితకు ఎంతో ఇష్టం

జయలలితకు ఎంతో ఇష్టం

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఎంతో ఇష్టం అయిన కొడనాడు ఎస్టేట్ లో 2017లో హత్య, దోపిడీ జరగడం అప్పట్లో కలకలం రేపింది. ఇప్పటికే ఈ కేసులో వలయూరు మనోజ్ తో పాటు 10 మందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలుకు వెళ్లిన అందరూ బెయిల్ మీద బయటకు వచ్చారు

Wife: భర్త హత్యకు భార్య మాస్టర్ ప్లాన్, ఎగేసుకుంటూ వచ్చిన ప్రియుడు, అక్క కూతురి చేతిలో ?, మర్మాంగం !Wife: భర్త హత్యకు భార్య మాస్టర్ ప్లాన్, ఎగేసుకుంటూ వచ్చిన ప్రియుడు, అక్క కూతురి చేతిలో ?, మర్మాంగం !

316 మంది విచారణ

316 మంది విచారణ

కొడనాడు ఎస్టేట్ హత్య కేసు విచారణ వేగవంతం చెయ్యాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి కొడనాడు ఎస్టేట్ హత్య, దోపిడీ కేసు విచారణ ముమ్మరం చేశారు. గత ఏడాది ఆగస్టు 7వ తేదీ నుంచి మళ్లీ విచారణ ప్రారంభించిన సీబీసీఐడీ అధికారులు ఇప్పటి వరకు 316 మందిని విచారణ చేసి వివరాలు సేకరించారు.

శశికళ బంధువు విచారణ

శశికళ బంధువు విచారణ

కొడనాడు ఎస్టేట్ లో జరిగిన హత్య, దోపిడీ కేసులో కనగరాజన్ సోదరుడు ధనపాల్, బంధువు రమేష్, కొడనాడు ఎస్టేట్ మేనేజర్ నటరాజన్, శశికళ సమీప బంధువు వివేక్, ఈ కేసు తరువాత ఆత్మహత్య చేసుకున్న కంప్యూటర్ ఆపరేటర్ దినేష్ తండ్రి భోజన్ లను సీబీసీఐడీ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు.

సీబీసీఐడీ ఎంట్రీతో

సీబీసీఐడీ ఎంట్రీతో

జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ కేసు విచారణ చెయ్యాలని సీబీసీఐడీకి తమిళనాడు డీజేపీ ఆదేశాలు జారీ చేశారు. కేసు సీబీసీఐడీ చేతికి వెళ్లిపోవడంతో కేసు విచారణ వేగవంతం అయ్యింది. ఇప్పటికే 316 మందిని విచారణ చేసిన సీబీసీఐడీ అధికారి క్రిష్ణమూర్తి ఆ నివేదికన న్యాయమూర్తికి అందించారు.

ఎక్కడికి వెళ్లకూడదు

ఎక్కడికి వెళ్లకూడదు

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన సాక్షాలు, ఆధారాలు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి సీబీసీఐడీ అధికారులు తీసుకున్నారు. కొడనాడు ఎస్టేట్ ఉద్యోగులను విచారణ చేసిన సీబీసీఐడీ అధికారులు మీరే విదేశాలకు వెల్లకూడాదని, రెండు మూడు రోజుల్లో మళ్లీ వచ్చి విచారణ చేస్తున్న సీబీసీఐడీ అధికారలు కొడనాడు ఎస్టేట్ సిబ్బందికి సూచించని వెలుగు చూసింది.

English summary
Estate: In connection with the case of murder and robbery in Jayalalithaa Koda Nadu Estate లBungalow in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X