అనూహ్య హత్య: వీడిన మిస్టరీ, తీసుకెళ్లిన వ్యక్తి అరెస్ట్
ముంబై/విజయవాడ: కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సాఫ్టువేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో మిస్టరీ వీడింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసింది. ఈ ఘటనలో నిందితుడిని ముంబై సిట్ పోలీసులు నాసిక్‌లో సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
లోకమాన్య తిలక్ రైల్వే స్టేషన్ నుండి అనూహ్యను తీసుకెళ్లినట్లు సిసిటివి ఫుటేజిలో ఉన్న వ్యక్తి, నాసిక్‌లో సిట్ అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఒక్కరేనని పోలీసులు తేల్చారు. నిందితుడు కూడా విచారణలో తన నేరాన్ని అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు లేదా రేపు మీడియా ముందు అతనిని ప్రవేశ పెట్టే అవకాశముంది.

కాగా, కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సాఫ్టువేర్ ఇంజనీర్ అనూహ్య జనవరి నెలలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును ముంబై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇటీవలె హత్య జరిగిన దాదాపు యాభై రోజుల తర్వాత కేసు ముగింపు దశకు చేరుకుంది. రైల్వే స్టేషన్ నుండి అనూహ్యతో వెళ్లిన వారు ఎవరనే విషయమై పోలీసులు దర్యాఫ్తు చేశారు. రైల్వే స్టేషన్‌లో అనుమానితుడి అస్పష్టమైన పిక్చర్‌ను గతంలో విడుదల చేసిన పోలీసులు, గత సోమవారం స్పష్టమైన పిక్చర్ విడుదల చేశారు.
ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. మరోవైపు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ అనూహ్య కేసుకు సంబంధించి రివ్యూ చేశారు. బలమైన ఆధారాలు లభించాయని, టీమ్స్ దీనిపై పని చేస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు నిందితుడిని పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications