పసులనే బలవంతంగా తీసుకెళ్లలేరు: రేప్‌లపై ఎంపి

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై సమాజ్‌వాదీ పార్టీ నాయకులు వితండ వాదనలు, వింత వాదనలు చేస్తున్నారు. పరిమితులు దాటి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అనుచరుడు, పార్లమెంటు సభ్యుడు నరేష్ అగర్వాల్ వ్యాఖ్యలు చేశారు.

మహిళలపై అత్యాచారాలు, నేరాలు పెరుగుతున్న వైనంపై ఆయన మాట్లాడుతూ జంతువులను కూడా బలవంతంగా లాక్కెళ్లలేరని వ్యాఖ్యానించారు. ఈ న్యూస్ చానెల్‌లో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వత్రా విమర్శలకు గురవుతున్నాయి. ఒక వ్యక్తి పెంపుడు జంతువులను కూడా మరో వ్యక్తి బలవంతంగా లాక్కెళ్లలేడని ఆయన వ్యాఖ్యానించారు.

Even animals can't be forcefully dragged away: Samajwadi MP

బాదౌన్ అత్యాచారాల కేసులో విచారణ జరుగుతోందని, ఆరోపణల్లోని వాస్తవాస్తవాలు విచారణలో తేలుతాయని, ఆరోపణల్లో నిజం ఉందని తేలితే చర్యలుంటాయని, లేదంటే ఉండవని ఆయన అన్నారు. ప్రజలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంఘటనలను మాత్రమే చూస్తున్నారని, ఇతర ప్రాంతాల్లోని సంఘటనలను చూడడం లేదని విమర్శించారు.

నరేష్ అగర్వాల్ వ్యాఖ్యలపై సామాజిక కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. అగర్వాల్ మహిళలను జంతువులతో పోల్చడం సిగ్గుచేటు అని వుమెన్ పవర్ కనెక్ట్ చైర్‌పర్సన్ రంజన కుమారి అన్నారు. బాధ్యతారహితమైన, సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేశారని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+