వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పళనిసామి బలపరిక్ష: కోర్టుకు వెళ్లాలని చెప్పిన గవర్నర్ !

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి బలపరిక్షలో ఎవరికైనా అనుమానాలు ఉంటే కోర్టుకు వెళ్లాలని గవవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు సూచించారని తెలిసింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి బలపరిక్షలో ఎవరికైనా అనుమానాలు ఉంటే కోర్టుకు వెళ్లాలని గవవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు సూచించారని తెలిసింది. మీకు అనుమానాలుంటే కోర్టుకు వెలితే న్యాయస్థానం నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తుందని గవర్నర్ సూచించారని సమాచారం.

శనివారం తమిళనాడు సచివాలయంలో బలపరిక్షసందర్బంగా ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి అనే విషయంపై గవర్నర్ విద్యాసాగర్ రావు నివేదిక కోరారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ విషయంలో గవర్నర్ విద్యాసాగర్ రావ్ జోక్యం చేసుకునే అవకాశం లేదు.

డీఎంకే, పన్నీర్ ఫిర్యాదు

డీఎంకే, పన్నీర్ ఫిర్యాదు

అసెంబ్లీలో ఎడప్పాడి పళనిసామి బలపరిక్ష నియమాలకు విరుద్దంగా జరిగిందని తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఫిర్యాదు చేశారు.

అనుమానాలు లేవు

అనుమానాలు లేవు

అయితే గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఇచ్చిన నివేదికలో ఎడప్పాడి పళనిసామికి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారందరూ ఆయనకు ఓటు వేశారని అధికారులు పూర్తి సమాచారం ఇచ్చారు. ప్రతిపక్షాలు ఉన్నా, రహస్య ఓటింగ్ జరిగినా 122 మంది ఎమ్మెల్యేలు ఎడప్పాడి పళనిసామికి ఓటు వేసేవారని అధికారులు నివేదిక తెలిపారని సమాచారం.

స్పీకర్ ఎలా వ్యవహరించారు ?

స్పీకర్ ఎలా వ్యవహరించారు ?

అసెంబ్లీలో బలపరిక్ష ఎలా నిర్వహించాలి అనే విషయం స్పీకర్ నిర్ణయిస్తారు. ఈ విషయంపై తాను నివేదిక ఇవ్వాలని అడుగుతానని గవర్నర్ విద్యాసాగర్ రావు చెప్పారు. అయితే స్పీకర్ నిర్ణయం విషయంలో తాను జోక్యం చేసుకోనని గవర్నర్ విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు.

స్పీకర్ కు ఆ అధికారం ఉంది

స్పీకర్ కు ఆ అధికారం ఉంది

ఓటింగ్ ఎలా నిర్వహించాలి అనే నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ కు ఉందని, ఆయన తీసుకునే నిర్ణయం విషయంలో ఎవ్వరూ జోక్యం చేసుకునే అవకాశం లేదని సమాచారం. అయితే స్పీకర్ ధనపాల్ పక్షపాత వైఖరితో వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి.

కోర్టును ఆశ్రయించండి

కోర్టును ఆశ్రయించండి

స్పీకర్ ధనపాల్ మీద ఆరోపణలు చేస్తున్న వారు నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్, పన్నీర్ సెల్వం వర్గీయులకు సూచించారని తెలిసింది. కోర్టు నివేదిక తెప్పించుకుని పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని గవర్నర్ విద్యాసాగర్ రావు ఫిర్యాదు చేసిన స్టాలిన్, పన్నీర్ సెల్వం వర్గీయులకు సూచించిందని తెలిసింది.

English summary
Even as Governor of Tamil Nadu, Vidyasagar Rao sought for a report on the trust vote held on Saturday, sources say that he is unlikely to interfere. The DMK and the O Panneerselvam group had complained that the rules were not followed during the trust vote. They sought for an investigation into the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X