వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభలో మోడీని అడ్డుకోబోయిన రేణుకా చౌదరి, ఆసుపత్రికి వెళ్లాలని వెంకయ్య చురక

|
Google Oneindia TeluguNews

Recommended Video

Renuka Chowdhary 'Surpanakha' Video

న్యూఢిల్లీ: ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకంపై ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో ప్రసంగించారు. ఈ పథకంలో లోపాలు ఉంటే ఉండవచ్చునని, కాంగ్రెస్ సభ్యులు పరిశీలించి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. అమెరికాలో స్కీంకు దీనికి పోలిక లేదన్నారు.

ఆరోగ్య రంగంలో చేయాల్సింది చాలా ఉందన్నారు. అలా అని కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని కాదన్నారు. మంచి సలహాలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధమన్నారు. పేదలకు సేవ చేసేందుకు పార్టీలతో సంబంధం లేదన్నారు. మీరు అవినీతి భారత్‌ను కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు.

ఇండియాకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మంచి ర్యాంకు వస్తే మీకెందుకు బాధ అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. మోడీపై దాడిని కాస్త ఇండియాపై దాడికా మార్చుతున్నారన్నారు. ఇది గర్వించదగ్గ విషయమన్నారు.

Even Gandhi said India doesn't need Congress after Independence

నేను ఇంగ్లీష్‌లో 9 రాస్తే మీకు ఆరుగా కనిపించవచ్చునని చెప్పారు. కాంగ్రెస్ లేని దేశాన్ని గాంధీజీనే కోరుకున్నారని చెప్పారు. స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ అవసరం లేదని ఆయన చెప్పారన్నారు.

దావోస్‌కు మీరు వెళ్లారు, మేమూ వెళ్లామని, మీకు సిఫార్సులతో వెళ్లే భారత్ కావాలని ఎద్దేవా చేశారు. మాదీ పేర్లు మార్చే ప్రభుత్వం కాదని, లక్ష్యాలు నెరవేర్చే ప్రభుత్వమని చెప్పారు. ఈ దేశాన్ని గట్టెక్కిస్తామని చెప్పారు. మాకు ఎవరైనా జై కొడితే కాంగ్రెస్‌కు బాధ కలగడం సహజమే అన్నారు.

ఆయుష్మాన్ భవతో 50 కోట్ల మందికి ప్రయోజనమని చెప్పారు. మీకు నవభారత్ అక్కరలేదా అన్నారు. మీరు ఎమర్జెన్సీ భారత్ కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు.

వెంకయ్య చురక
రేణుకా చౌదరికి వెంకయ్య చురక

కాగా, ప్రధాని మోడీ మాట్లాడుతూండగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేణుకా చౌదరి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రాజ్యసభ వైస్ చైర్మన్ వెంకయ్య నాయుడు స్పందిస్తూ.. ఆరోగ్య సమస్య ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లాలని చురకలు వేశారు.

ఎర్రకోట పైనుంచి తాను చేసిన ప్రసంగంలోని అన్ని వాగ్ధానాలను నెరవేర్చామని చెప్పారు. కానీ గతంలోని కాంగ్రెస్ ప్రధానులు ఎవరూ ఆ పని చేయలేదన్నారు.

గతంలో యూరియా కోసం సీఎంలు కేంద్రానికి లేఖ రాసేవారని, తాము అధికారంలోకి వచ్చాక ఒక్క లేఖ రావడం లేదన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకు రాకపోవడం కాంగ్రెస్ గొప్పేనని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు రూ.35వేల కోట్ల నల్లధనాన్ని జఫ్తు చేశామన్నారు. నల్లధనం వెనక్కి తెచ్చిన క్రెడిట్ మీరే తీసుకోండని చెప్పారు.

20 ఏళ్ల క్రితం ఇచ్చిన ఐడియాతోనే కాంగ్రెస్ ఆధార్ కార్డు తీసుకు వచ్చిందన్నారు. బ్లాక్ మనీపై సిట్ వేయాలని సుప్రీం కోర్టు చెప్పినా వేయకపోవడం కాంగ్రెస్ క్రెడిట్ అన్నారు. జీఎస్టీని కాంగ్రెస్ బహిష్కరించిందని గుర్తు చేశారు.

స్వచ్ఛ భారత్‌ను అవమానిస్తున్నారని, సర్జికల్ స్ట్రయిక్స్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.

English summary
Parliament Budget Session 2018 Live Updates, Even Gandhi said India doesn't need Congress after Independence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X