వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మార్స్‌లో ఉన్నా.. సాయం చేయండి’: సుష్మా రెస్పాన్స్ అదుర్స్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఇతర దేశాల్లోని ఎవరైన భారతీయులు ఆపదలో ఉన్నామంటూ సాయం కోరిన వెంటనే నేనున్నానంటూ అభయహస్తమందించే మన దేశ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఇతర దేశాల్లోని ఎవరైన భారతీయులు ఆపదలో ఉన్నామంటూ సాయం కోరిన వెంటనే నేనున్నానంటూ అభయహస్తమందించే మన దేశ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఓ నెటిజన్ వింతగా సాయం కోరాడు. దీనికి సుష్మా స్వరాజ్ కూడా తనదైన శైలిలో స్పందించి ప్రశంసలందుకుంటున్నారు. అయితే, వెటకారంగా సాయం కోరిన ఆ నెటిజన్‌కు మాత్రం ఇతర నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. కరణ్‌ సైని అనే ఓ నెటిజన్‌ సుష్మా స్వరాజ్‌కు గురువారం ఉదయం వ్యంగ్యంగా ఓ ట్వీట్‌ చేశారు. అందుకు సుష్మాజీ కూడా తనదైన శైలిలో స్పందించారు.

'Even if you are stuck in Mars, our embassy will help you': Sushma Swaraj

'నేను మార్స్‌లో చిక్కుకుపోయాను. మంగళయాన్‌ ద్వారా నాకు ఆహారం పంపించండి. మంగళయాన్‌-2 ఎప్పుడు పంపిస్తారు?' అంటూ కరణ్‌ ట్వీట్‌ చేశారు. అందుకు వెంటనే స్పందించిన సుష్మా స్వరాజ్.. 'మీరు మార్స్‌లో చిక్కుకుపోయినా.. భారత దౌత్యకార్యాలయం మీకు సాయం చేస్తుంది' అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా, కరణ్‌ సైని చేసిన ట్వీట్‌పై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా మంచి పని చేస్తే దాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ అతన్ని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. కుల, మత, ప్రాంతీయ తారతమ్యాలు లేకుండా విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సుష్మా స్వరాజ్‌ ఆపన్నహస్తం అందిస్తున్నారని ప్రశంసించారు.

అంతేగాక, ఇటీవలే ఓ పాక్‌ జాతీయుడు 'నా బిడ్డకు ఆపరేషన్‌ చేయించేందుకు భారత్‌ తీసుకురావాలి. అందుకోసం మెడికల్‌ వీసా మంజూరు చేయాలి' అని కోరగా.. అందుకు వెంటనే స్పందించిన ఆమె పాక్‌ బాలుడికి మెడికల్‌ వీసా వచ్చేలా చేసిందని కొనియాడారు.

English summary
External Affairs Minister Sushma Swaraj is as witty in her Twitter replies as she is steadfast in helping Indians abroad who are in distress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X