మారిన వైఖరి, ఛాయ్‌వాలా ప్రధాని కావొచ్చు: డిగ్గీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బహుశా ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గుర్తుకు రాకపోవచ్చు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఛాయ్ అమ్ముకునే వారు కూడా భారత ప్రధాన మంత్రి కావొచ్చని ఆయన అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలు బిజెపిని, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిని స్వాగతించేలా ఉండడంతో బిజెపి నేతలు స్వాగతించారు.
నరేంద్ర మోడీ ప్రస్తుతం మూఢ విశ్వాసాలను వదిలించుకోవడంతోపాటు, వాటికి దూరంగా ఉంటున్నారని దిగ్విజయ్ సింగ్ మోడీకి సానుకూలంగా స్పందించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతేగాక, మూఢ విశ్వాసాలను వీడి మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయి సిద్ధాంతాలను మోడీ అనుసరించడం స్వాగతించతగ్గ పరిణామం అని దిగ్విజయ్ అన్నారు. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఛాయ్ అమ్ముకునే వారూ ప్రధాని కావొచ్చని అన్నారు.

కాంగ్రెస్ సిద్ధాంతాలకు, జవహర్ లాల్ నెహ్రూ ఆశాయాలకు నరేంద్ర మోడీ, బిజెపిలు దగ్గరవుతున్నాయని ఆయన అన్నారు. అయితే మోడీని భారత ప్రజలు ప్రధానిగా అంగీకరించరని ఆయన తెలిపారు. ఒక వేళ బిజెపి అధికారంలోకి వస్తే ఆ పార్టీలో మరో నేత సుష్మా స్వరాజ్‌ను ప్రధానిగా చేయాలని దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం చేతిలో కొనసాగుతోందని, బిజెపికి కింది స్థాయి ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోందన్న ప్రశ్నలకు సమాధానంగా.. అది నిజం కాదని దిగ్విజయ్ చెప్పారు.
భారత ప్రజాస్వామ్యంలో అంటరాని వారు ఎవరూ ఉండరని, ధనిక, పేద భేదం ఏమి లేదని తెలిపారు. కేరళ రాష్ట్రానికి చెందిన గొర్రెల కాపరి రాష్ట్రపతి కావొచ్చని లేదా ఓ ఛాయ్‌వాలా ప్రధానమంత్రి కావొచ్చని దిగ్విజయ్ సింగ్ అన్నారు. దిగ్విజయ్ సింగ్ తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి సానుకూలంగా మాట్లాడి ఉంటే తమకు సంతోషమేనని బిజెపి సీనియర్ నేత స్మృతి ఇరానీ చెప్పారు.












Click it and Unblock the Notifications