అమిత్ షాతో ప్రత్యేకంగా వర్చువల్ గా భేటీ అయిన ఏపీ IPS అధికారి

ఢిల్లీలోని చారిత్రాత్మక రెడ్ ఫోర్ట్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ పేలుడులో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారికి ఢిల్లీ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తోన్నారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉంటోంది. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ కారులో ఈ పేలుడు సంభవించింది.

గుజరాత్ లో ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన అతి కొద్దిరోజుల్లోనే ఈ పేలుడు సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని తర్వాత ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసమ్మర్థంతో కూడుకుని ఉన్న ప్రదేశాలు, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై నిఘా పెంచారు. రాత్రంతా పోలీసులు పహారా చేపట్టారు. వాహనాల తనిఖీ ముమ్మరంగా కొనసాగింది. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం వదిలిపెట్టారు.

Everyone involved in this act will face the full wrath of our agencies says Amit Shah

దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థను రంగంలోకి దింగింది. సమగ్ర దర్యాప్తు చేపట్టింది. ఢిల్లీ వ్యాప్తంగా ఉగ్రకదలికలపై నిఘా పెట్టింది. యూఏపీఏ కింద కేసులు నమోదయ్యాయి. యూఏపీఏలోని సెక్షన్లు 16, 18, ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్‌లోని సెక్షన్లు 3, 4, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 103(1), 109(1), 61(2) కింద ఈ కేసు పెట్టారు. రెడ్ ఫోర్ట్ ను మూసివేశారు. ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే- రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ కూడా క్లోజ్ అయింది.

ఈ ఘటనపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఢిల్లీ కర్తవ్య భవన్‌లో ఈ భేటీ ఏర్పాటైంది. హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఏర్పాటైన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా, ఎన్‌ఐఏ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ వర్చువల్‌ హాజరయ్యారు.

కొద్దిసేపటి కిందటే ఈ భేటీ ముగిసింది. దీనికి సంబంధించిన వివరాలను అమిత్ షా వెల్లడించారు. ఈ ఘటన వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ వేటాడి పట్టుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ చర్యలో పాలుపంచుకున్న వారందరూ చట్టం ముందు తప్పకుండా నిలబడతారని, కఠిన శిక్షను ఎదుర్కొంటారని చెప్పారు. ఈ వివరాలను క్లుప్తంగా తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+