కర్ణాటకను మిని పాకిస్తాన్ చేస్తారా ?, టిప్పుసుల్తాన్ ను ఫాలో అవుతున్నారా ? !

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై ఆరోపణలు ఎక్కువ చేస్తున్నారు. కర్ణాటకను మినీ పాకిస్థాన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే ఆర్.అశోక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిప్పుసుల్తాన్ మతమార్పిడి సిద్ధాంతాన్ని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో అమలు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నదని, అందుకే పీఎఫ్ఐ, కేఎఫ్ డీ లాంటి సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆర్. అశోక్ ఆరోపించారు.

కర్ణాటకలో మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు ? అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. డబ్బు కోసం, లవ్ జిహాద్, హాస్పిటల్ బిల్లులు కట్టలేని వారికి ఎర వేశారని, ఇలా చేసి 30 లక్షల నుంచి 40 లక్షల మంది హిందువులు మతం మారినట్లు మా దగ్గర సమాచారం ఉందని ఆర్. అశోక్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎవరి కోసం ఈ చట్టం తెస్తోంది? అని ప్రజలకు చెప్పాలని సీఎం సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ఆర్ అశోక్ నిలదీశారు. మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్ కూడా మతమార్పిడి చట్టప్రకారం జరగాలనే చెప్పారని ఆర్. అశోక్ గుర్తు చేశారు.

Karnataka

టిప్పుసుల్తాన్ కొడగులో 50 వేల నుండి 60 వేల మందిని మతం మార్చాడని మాజీ మంత్రి ఆర్. అశోక్ ఆరోపించారు. టిప్పుసుల్తాన్ సిద్దాంతాలను సిద్దరామయ్య ప్రభుత్వం అనుసరిస్తున్నదని మాజీ మంత్రి అశోక్ విమర్శించారు. కర్ణాటకలో అమలులో ఉన్న మతమార్పిడి చట్టాన్నిఉపసంహరించుకోవద్దని బీజేపీ డిమాండ్ చేస్తుందని అర్. అశోక్ అన్నారు. ఓటు బ్యాంకు కోసం, సమాజాన్ని ప్రలోభపెట్టేందుకు మతమార్పిడి నిషేద చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నారని ఆర్. అశోక్ ఆరోపించారు.

ముందుగా రైతులు పండించిన ఉత్పత్తులను విక్రయించేందుకు ఏపీఎంసీని ప్రారంభించారు. ఇది ఒక రకమైన లీజు ప్రయత్నం. దళారీలు గేటు దగ్గర నిలబడి రైతుల దగ్గర బలవంతంగా కొనుక్కుని లాభపడే వ్యవస్థను అడ్డుకోవడానికి సవరణ చట్టం ప్రకారం రైతులు దేశంలో ఎక్కడికైనా విక్రయించుకునే అవకాశం కల్పించాం. రైతులకు వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆర్. అశోక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడు ఏపీఎంసీకి లబ్ధి చేకూరాలా? బ్రోకర్ల లాభాలు పెరగాలా? చేస్తున్నారని ఆర్. అశోక్ మండిపడ్డారు.

Karnataka

ఏపీఎంసీ చట్టం సవరిస్తే దళారులకు లాభం ఉంటుందని, బరువులో తేడా వస్తుందని, కానీ మేము రైతులకు లాభం చేకూరేలా చేశామని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దళారీలుగా మారుతున్నారని ఆర్. అశోక్ అన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం అయిన తరువాత పాఠ్యపుస్తకాలు మార్చేంత హడావుడి ఎందుకని, పిల్లలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతో మీరు హఠాత్తుగా మీ భావజాలాన్ని పిల్లల మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం మీద మాజీ మంత్రి ఆర్. అశోక్ మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+