మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఆయన ఆరోగ్యం క్షీణించడంతో దిల్లీ ఎయిమ్స్‌లో చేర్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. గురువారం సాయంత్రం మన్మోహన్ సింగ్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.మన్మోహన్ సింగ్‌ ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యులు ఎలాంటి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయలేదు. ఆయన ఆసుపత్రిలో ఏ అనారోగ్య సమస్య కారణంగా చేరారో తెలియరాలేదు.

Ex-Indian PM Manmohan Singh admitted to hospital

మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా సేవలందించారు. రెండుసార్లు దేశానికి ప్రధాన మంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్‌, తన హయంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చూట్టారు. తన పాలనపై శ్రద్ధ, పని పట్ల అతని విద్యా విధానం, నిరాడంబరమైన జీవితంతో మంచి గుర్తింపు పొందాడు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో ఆర్బీఐ గవర్నర్ హోదాలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు.మన్మోహన్ సింగ్ హయాంలో గణనీయమైన జీడీపీ వృద్ధిరేటు నమోదుకాగా.. దేశంలో పేదరికం తగ్గుముఖంపట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+