నా కుటుంబాన్ని టార్గెట్ చేసి కేసులు పెట్టారన్న మాజీ సీజేఐ..!

తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని క్రిమినల్‌ కేసులు పెట్టారని.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు అమరావతిలోని విట్‌ ఏపీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఐదో స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా.. న్యాయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టడం.. న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకురావడం వంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడారు.

న్యాయమూర్తులు, న్యాయవాదులపై వేధింపులు..

తనపై ఒత్తిడి తీసుకురావడానికే ఇలా చేశారని అందరికీ తెలుసన్నారు రమణ. రైతుల పక్షాన మాట్లాడిన వారందరినీ భయపెట్టే ప్రయత్నం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో రాజ్యాంగ విలువలు కాపాడిన న్యాయమూర్తులు బదిలీలు.. ఒత్తిళ్లు, వేధింపులు ఎదుర్కొన్నారని, వారి కుటుంబాలను రాజకీయ కుట్రలకు బలి చేశారని తీవ్రంగా విమర్శించారు. బాధ్యతగా పనిచేయడమూ కొన్నిసార్లు వ్యక్తిగతమైన బాధగా మిగిలిపోతుందని ఆయన అన్నారు. అలాంటి క్లిష్ట సందర్భాల్లోనూ న్యాయమూర్తులు, న్యాయవాదులు రాజ్యాంగానికి అనుగుణంగా.. ధైర్యంగా పనిచేశారని ఆయన కొనియాడారు.

ex-justice-n-v-ramana-shocking-comments-on-criminal-cases

ఆకాంక్షలకు ప్రతీక నవ్యాంధ్రప్రదేశ్..

జస్టిస్ రమణ అమరావతి రైతుల పోరాటాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అమరావతి నవ్యాంధ్రప్రదేశ్‌ ఆకాంక్షలకు ప్రతీక అని.. రాజధానిని నిలబెట్టుకోవడానికి అమరావతి రైతులు ఐదేళ్ల పాటు ఎన్నో కష్టాలు పడ్డారని.. అణచివేతకు గురయ్యారని గుర్తు చేశారు. అయినప్పటికీ వారు ధైర్యంగా శాంతియుతంగా సాగించిన పోరాటం అజరామరం అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఒత్తిళ్లు వచ్చినా వెనుకాడని అమరావతి రైతుల ధైర్యానికి సెల్యూట్‌ చేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర పోరాటం తర్వాత దక్షిణ భారతదేశంలో జరిగిన సుదీర్ఘ పోరాటంగా దీనిని అభివర్ణించారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచినందుకు రైతులకు కృతజ్ఞతలు చెప్పారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు పాత విధానాలను రద్దు చేయడం సరికాదని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మారినప్పుడు పాత విధానాలను రద్దు చేయడం సరికాదని.. అలా చేస్తే అభివృద్ధి ఆగిపోవడంతో పాటు ప్రజలు ఇబ్బందులు పడతారనడానికి అమరావతి అనుభవమే సాక్ష్యం అని ఉద్ఘాటించారు. అధికార వ్యవస్థను ప్రతీకార రాజకీయాలకు వాడకూడదని తాను ఒక తీర్పులో కూడా చెప్పినట్లు గుర్తుచేశారు. ప్రభుత్వాలు మారినా న్యాయస్థానాలు, చట్టపరిపాలన దేశానికి స్థిరమైన ఆధారం అని, అందువల్ల ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంచాలని సూచించారు.

ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం గురించి కూడా జస్టిస్ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని కృత్రిమ మేధస్సు (AI), క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ప్రభావితం చేస్తున్నాయని.. అయితే ఈ సమాచార యుగంలో కచ్చితమైన సమాచారం పొందడం కష్టమైందని ఆందోళన వ్యక్తం చేశారు. కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చినా అది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ex-justice-n-v-ramana-shocking-comments-on-criminal-cases

యువతకు సూచనలు..

విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన జస్టిస్ రమణ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.

యువత వీలైనన్ని భాషలు నేర్చుకోవాలని, అయితే, మాతృభాషను మాత్రం ఎప్పటికీ మరిచిపోవద్దని సూచించారు.

మన చరిత్ర, సంస్కృతికి నిలువుటద్దం అమరావతి అని గుర్తు చేశారు.

గౌరవ అతిథిగా హాజరైన శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ రాజీవ్‌వర్మ, విద్యార్థులు సవాళ్లను విజయాలకు బాటలుగా మార్చుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+