EX wife: లవ్ మ్యారేజ్, ఎంజాయ్ చేస్తున్న జులాయి, దానికితోడు డౌట్, అర్దరాత్రి భార్య చేతిలో కుక్కచావు !
చెన్నై/మైలాడుతురై: ఒకే చోట పని చేస్తున్న సమయంలో యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. కొంతకాలం తరువాత ప్రేమించుకున్న ప్రేమికులు చివరికి లవ్ మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. మతాలు వేరుకావడంతో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించకపోయినా ప్రేమికులు పెద్దగా పట్టించుకోలేదు, లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, కొంతకాలం చక్కగా సంసారం చేసిన భర్త తరువాత జులాయిగా తిరగడం మొదలుపెట్టాడు. బయటకు వెళ్లి ఉద్యోగం చేస్తున్న భార్య ఆమె పిల్లలను పోషిస్తోంది. భార్య ఆమె భర్తను వదిలేసింది. బయట తిరుగుతున్న భార్య మీద భర్త అనుమానం పెంచుకున్నాడు, రాత్రి పీకలదాక మద్యం సేవించి వెళ్లి భార్యను చితకబాదేశాడు. రాత్రి దంపతుల మద్య ఇదే విషయంలో గొడవ జరిగింది, ఆ సందర్బంలో కొడవలి తీసుకున్న భార్య ఆమె భర్తను నరికి చంపేయడం కలకలం రేపింది.

14 ఏళ్ల క్రితం ?
తమిళనాడులోని యైలాడుతురై జిల్లాలోనిమొజురాయూర్ లోని మండగితీతల్ ప్రాంతంలో రామస్వామి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రామస్వామికి రమ్యా (30) అనే కుమార్తె ఉంది, రమ్యా 14 సంవత్సరాల క్రితం కోయంబత్తూరులో ఉండేది. ఆ సందర్బంలో తిరునల్వేలి జిల్లాలోని వల్లీయూర్ లోని కూతంగడి ప్రాంతంలో నివాసం ఉంటున్న జోసెఫ్ కుమార్ (36) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.

లవ్ మ్యారేజ్
కొంతకాలం స్నేహితులుగా ఉన్న రమ్యా, జోసెఫ్ కుమార్ తరువాత ప్రేమించుకున్నారు. చివరికి ప్రేమికులు రమ్యా, జోసెఫ్ కుమార్ చివరికి లవ్ మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. మతాలు వేరుకావడంతో పెద్దలు రమ్యా, జోసెఫ్ కుమార్ ల పెళ్లికి అంగీకరించకపోయినా ప్రేమికులు పెద్దగా పట్టించుకోలేదు.

జలాయిగా మారిపోయిన భర్త
లవ్ మ్యారేజ్ చేసుకున్న జోసెఫ్, రమ్యా దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత కొంతకాలం చక్కగా సంసారం చేసిన జోసెఫ్ తరువాత జులాయిగా తిరగడం మొదలుపెట్టాడు. భార్య రమ్యాను, ముగ్గురు పిల్లలను గాలికి వదిలేస్తున్న జోసెఫ్ స్నేహితులతో కలిసి చిన్నచిన్న పనలు చేసుకుంటూ వచ్చిన డబ్బుతో మద్యం సేవించి జల్సా చేస్తున్నాడు.

భర్తను వదిలేసింది..... భార్య మీద అనుమానం
రెండు సంవత్సరాల క్రితం జోసెఫ్ ఆగడాలు ఎక్కువ కావడంతో విసిగిపోయిన రమ్యా ఆమె భర్తను వదిలేసి ముగ్గురు పిల్లలతో కలిసి వేరుగా నివాసం ఉంటున్నది. మైలాడుతురై సమీపంలోని శ్రీనివాసపురంలోని ఓ బేకరిలో ఉద్యోగంలో చేరిన రమ్యా డబ్బులు సంపాధిస్తూ ఆమె ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్నది.

భర్తను నరికి చంపేసిన భార్య
బయట తిరుగుతున్న భార్య రమ్యా మీద ఆమెను వదిలేసి దూరంగా ఉంటున్న భర్త జోసెఫ్ అనుమానం పెంచుకున్నాడు, రాత్రి పీకలదాక మద్యం సేవించి భార్య రమ్యా ఇంటికి వెళ్లిన జోసెఫ్ అతని భార్యను చితకబాదేశాడు. రాత్రి దంపతుల మద్య ఇదే విషయంలో గొడవ జరిగింది, ఆ సందర్బంలో సహనం కోల్పోయిన రమ్యా కొడవలి తీసుకుని ఆమెకు దూరంగా ఉంటున్న భర్త జోసెఫ్ ను దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications