EX Wife: విడాకులు ఇచ్చిన భార్య మీద నిఘా, గొంతు చీల్చేసి, బండరాయితో ఛట్నీ, డౌట్ తో !
బెంగళూరు/ మైసూరు: వివాహం చేసుకున్న దంపతులు చక్కగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు పుట్టిన తరువాత దంపతుల మద్య తేడాలు వచ్చాయి. పెద్దలు పంచాయితీలు చేసినా దంపతుల మద్య రాజీ కుదరలేదు. రానురాను దంపతుల మద్య విభేదాలు ముదరిపోయాయి. ఇప్పటికే భార్య ఆమె భర్త మీద మూడుసార్లు కేసు పెట్టింది. చాలాకాలం పంచాయితీలు చేసిన పెద్దలు విసిగిపోయారు. దంపతులు ఇద్దరూ విడాకులు తీసుకుని ఎవరి బతుకు వాళ్లు బతుకుతున్నారు. పుట్టింటిలో ఉంటున్న భార్య ఉద్యోగం చేస్తోంది. విడాకులు తీసుకున్న భార్య మీద భర్త నిఘా వేశాడు. మాజీ భార్య ప్రవర్తనలో మార్పు వచ్చిందని, బయట నా పరువు తీస్తోందని భర్త రగిలిపోయాడు. అంతే ఇక లాభం లేదని డిసైడ్ అయిన భర్త అతని మాజీ భార్య గొంతును కత్తితో చీల్చేసి ఆమె తల మీద బండరాళ్లు వేసి దారుణంగా హత్య చేశాడు. మాజీ భార్యను హత్య చేసిన భర్త ఏమీ తెలీనట్లు అతనిపాటికి అతను హ్యాపీగా తిరుగుతూ కేసు పక్కనోడి మీద వెయ్యడానికి ప్రయత్నించాడు.

15 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్
కర్ణాటకలోని మైసూరు తాలుకాలోని రాగిముద్దనహళ్ళిలో సురేష్ (42) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కాలేనహళ్ళి ఊరిలో నివాసం ఉ:టున్న షాలిని (33) అనే యువతి ప్రేమించుకున్నారు. మూడు సంవత్సరాలు ప్రేమించుకున్న సురేష్, షాలిని తరువాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. 15 ఏళ్ల క్రితం సురేష్, షాలిని ప్రేమ వివాహం చేసుకున్నారు.

దంపతుల మధ్య తేడాలు
ప్రేమ వివాహం చేసుకున్న సురేష్, షాలిని దంపతులు చక్కగా కాపురం చేశారు. సురేష్, షాలిని దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు పుట్టిన తరువాత రానురాను షాలిని, సురేష్ దంపతుల మద్య తేడాలు వచ్చాయి. పెద్దలు పంచాయితీలు చేసినా సురేష్, షాలిని దంపతుల మద్య రాజీ కుదరలేదు.

మూడుసార్లు భర్త మీద కేసు పెట్టిన భార్య
రానురాను సురేష్, షాలిని దంపతుల మద్య విభేదాలు ముదరిపోయాయి. ఇప్పటికే 2012, 2014లో రెండుసార్లు తన భార్య సురేష్ టార్చర్ పెడుతున్నడని షాలిని ఆమె భర్త జైలుకు వెళ్లి వచ్చాడు. 2014లో సురేష్ మీద ఓ కేసు నమోదు అయ్యిందని వెలుగు చూసింది. తన భార్య షాలిని తన మీద కేసులు పెట్టిందని ఆమె భర్త సురేష్ రగిలిపోయాడు.

భర్తకు విడాకులు ఇచ్చేసి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
చాలాకాలం షాలిని, సురేష్ దంపతుల మధ్య పంచాయితీలు చేసిన పెద్దలు విసిగిపోయారు. నాలుగు సంవత్సరాల క్రితం షాలిని, సురేష్ దంపతులు ఇద్దరూ విడాకులు తీసుకుని ఎవరి బతుకు వాళ్లు బతుకుతున్నారు. షాలిని కాలేనహళ్ళికి వెళ్లిపోయి ఆమె పుట్టింటిలో ఇద్దరు కూతుర్లతో కలిసి నివాసం ఉంటున్నది.

ఉద్యోగం చేస్తున్న మాజీ భార్య మీద నిఘా
మైసూరులోని ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న సురేష్ మాజీ భార్య షాలిని ఆమె ఇద్దరు పిల్లలను పెంచి పోషిస్తోంది. విడాకులు తీసుకున్న మాజీ భార్య షాలిని మీద ఆమె మాజీ భర్త సురేష్ నిఘా వేశాడు. భార్య షాలినికి విడాకులు ఇచ్చేసినా సురేష్ ఆమె ఏం చేస్తోంది, ఎక్కడికి వెలుతోంది అంటూ ఆరా తీస్తూనే ఉన్నాడు.

మాజీ భార్యను పక్కాప్లాన్ తో చంపేశాడు
తన మాజీ భార్య షాలిని ఎవరితోనే తిరుగుతోందని, ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందని, బయట నా పరువు తీస్తోందని ఆమె భర్త సురేష్ రగిలిపోయాడు. అంతే ఇక లాభం లేదని డిసైడ్ అయిన మాజీ భర్త సురేష్ అతని మాజీ భార్య పని ముగించుకుని ఇంటికి వెలుతున్న సమయంలో కత్తితో ఆమె గొంతు చీల్చేసి దారుణంగా పొడిచేశాడు. తరువాత షాలిని తల మీద బండరాళ్లు వేసి దారుణంగా హత్య చేశాడు. మాజీ భార్య షాలినిని హత్య చేసిన సురేష్ అతని సొంత ఊరిరి వెళ్లిపోయాడు.

ఏమీ తెలీనట్లు డ్రామాలు ఆడిన మాజీ మొగుడు
భార్య షాలినిని హత్య చేసిన తరువాత తనకు ఏమీ తెలీనట్లు సురేష్ అతనిపాటికి అతను హ్యాపీగా తిరుగుతూ కేసు పక్కనోడి మీద వెయ్యడానికి ప్రయత్నించాడు. అయితే షాలినిని ఆమె మాజీ భర్త సురేష్ హత్య చేశాడని ఆమె అన్న కేసు పెట్టాడు. కేసు నమోదు చేసి సురేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే అతనే హత్య చేసినట్లు అంగీకరించాడని మైసూరు జిల్లా ఏఎస్పీ యతీష్ మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications