Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ex wife: పుట్టింట్లో భార్య, ఎగరేసుకుంటూ వెళ్లిన మాజీ భర్త, టీ కాదు.. యాసిడ్ పోసింది, చచ్చినోడా!

చెన్నై/ బెంగళూరు/ తిరుపత్తూర్: రెండు రాష్ట్రాలకు చెందిన యువతి, యువకుడికి ఆరు నెలల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన మూడు నెలల పాటు దంపతులు సంతోషంగా గడిపారు. మూడు నెలల తరువాత ఇద్దరి మద్య తేడాలు వచ్చాయి. నువ్వు పనికిరాని వాడివి అంటూ భార్య, నువ్వే.... అంటూ భర్త గొడవలు పడ్డారు. పెళ్లైన ఆరు నెలలకే ఇద్దరూ విడిపోయారు. భార్యను వెతుక్కుంటూ ఎగరేసుకుంటూ ఆమె ఇంటికి వెళ్లిన భర్త మీద భార్య యాసిడ్ దాడి చెయ్యడం కలకలం రేపింది. ఇద్దరిని కలుపుదామని మధ్యవర్తిగా వెళ్లి యువతి యాసిడ్ దాడిలో తీవ్రగాయాలై ఇదెక్కడి దరిద్రంరా దేవుడా అంటూ ఆసుపత్రిలో కుయ్యోమొర్రో అంటున్నారు.

 జస్ట్ ఆరు నెలలు అంతే

జస్ట్ ఆరు నెలలు అంతే

బెంగళూరులోని జీవన్ భీమానగర్ లో నివాసం ఉంటున్న అప్సల్ సయ్యద్ (27) అనే యువకుడికి, తమిళనాడులోని తిరుపత్తూర్ కోట వీధి చంద్ మియాన్ వీధిలో నివాసం ఉంటున్న నస్రీన్ తాజ్ (25) అనే యువకుతికి ఆరు నెలల క్రితం వివాహం అయ్యింది. పెద్దలు కుదుర్చిన వివాహానికి బంధువులు అందరూ హాజరై అప్సల్ సయ్యద్, నస్రీన్ తాజ్ ను ఆశీర్వధించారు.

మూడు నెలలు ఓకే

మూడు నెలలు ఓకే

వివాహం అయిన తరువాత బెంగళూరులోని భర్త అప్సల్ సయ్యద్ ఇంటికి నస్రీన్ తాజ్ వచ్చింది. మూడు నెలల పాటు అప్సల్ సయ్యద్, నస్రీన్ తాజ్ సంతోషంగా కాపురం చేశారు. తరువాత దంపతుల మధ్య తేడా వచ్చేసింది. నువ్వు వేస్ట్ గాడివి అంటూ భార్య, నువ్వు.... అంటూ భర్త ఒకరిని ఒకరు బూతులు తిట్టుకున్నారు.

జెండా ఎత్తేసిన భార్య

జెండా ఎత్తేసిన భార్య

పెద్తలు సర్దిచెప్పడం, రాజీ చెయ్యడంతో అతి కష్టం మీద ఆరు నెలలు పాటు నస్రీన్ తాజ్, అప్సల్ సయ్యద్ కళ్లుమూసుకుని కాపురం చేశారు. తరువాత భర్త అప్సల్ సయ్యద్ తో తెగతెంపులు చేసుకున్న నస్రీన్ తాజ్ బెంగళూరు వదిలేసి తమిళనాడులోని తిరుపత్తూర్ లోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది.

భార్యను వెతుక్కుంటు వెళ్లిన భర్త

భార్యను వెతుక్కుంటు వెళ్లిన భర్త

భార్య నస్రీన్ తాజ్ వదిలేసి వెళ్లిపోయినా అప్సల్ సయ్యద్ మాత్రం ఆమెను ఒకసారి కలిసి మాట్లాడాలని నిర్ణయించాడు. చిన్నమ్మ కూతురు ఉవేష్ అనే యువతితో కలిసి తమిళనాడులోని తిరుపత్తూరులోని నస్రీన్ తాజ్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో మాజీ మొగుడు అప్సల్ సయ్యద్ తో నస్రీన్ తాజ్ గొడవ పెట్టుకునింది.

తాజ్ భలే ర్యాష్ గురు

తాజ్ భలే ర్యాష్ గురు

నస్రీన్ తాజ్, అప్సల్ సయ్యద్ మద్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన నస్రీన్ తాజ్ రెచ్చిపోయింది. సిగ్టులేనోడా, నిన్ను ఛీకొట్టి వదిలేసి వచ్చేసినా మళ్లీ నా ఇంటికి వస్తావా, మర్యాదగా వెళ్లిపో అంటూ రెచ్చిపోయింది. అప్సల్ సయ్యద్ కూడా రెచ్చిపోవడంతో సహనం కోల్పోయిన అతని మాజీ భార్య నస్రీన్ తాజ్ బాత్ రూమ్ లోకి వెళ్లి టాయిలెట్ క్లీన్ చెయ్యడానికి ఉపయోగించే యాసీడ్ తీసుకొచ్చి మాజీ మొగుడు అప్సల్ సయ్యద్, ఆమె చిన్నమ్మ కూతురు ఉవేశ్ మీద పోసేసింది.

Recommended Video

    Prabhudeva Biography.. ఇన్స్పిరేషన్ మెగాస్టార్ !
    వదిలేసినా తగులుకుంటావా?

    వదిలేసినా తగులుకుంటావా?

    యాసిడ్ దాడిలో తీవ్రగాయాలైన ఇద్దరు అక్కడి నుంచి పరుగు తీసి తిరుపత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అప్సల్ సయ్యద్ కేసు పెట్టడంతో తిరుపత్తూర్ పోలీసులు కేసు నమోదు చేసి అతని మాజీ భార్య నస్రీన్ తాజ్ ను విచారణ చేస్తున్నారు. నేను నా భర్త టార్చర్ తట్టుకోలేక అతన్ని వదిలేసి వచ్చినా మళ్లీ వచ్చి నన్ను తగులుకోవడానికి ప్రయత్నించి గొడవ పెట్టుకున్నాడని, అందుకే సహనం కోల్పోయి యాసీడ్ పోసేసానని నస్రీన్ తాజ్ పోలీసులకు చెప్పిందని తెలిసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+