పొలిటికల్ బ్లాస్టింగ్, విజయ్ కొత్త చరిత్ర- బెంగాల్ లో నో కన్ఫ్యూజన్..!?

తమిళనాడులో గెలుపు ఎవరిది. బెంగాల్ లో దీదీ పై బీజేపీ విజయం సాధిస్తుందా. ఇలాంటి ఎన్నో లెక్కలు.. మరెన్నో అంచనాలకు పూర్తి సమాధానం రానుంది. రికార్డు పోలింగ్ నమోదుతో ఈ రెండు రాష్ట్రాల్లో ఫలితం పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతున్నాయి. కాగా.. తమిళనాడులో ఫలితాలకు ముందే కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. విజయ్ కీలక పాత్ర పోషించటం ఖాయంగా కనిపిస్తోంది. బెంగాల్ లో పోలింగ్ సరళి తరువాత అందరి అంచనాలు తల కిందులు అయ్యాయి. దీంతో.. ఈ సాయంత్రం వెల్లడి కానన్న ఎగ్జిట్ పోల్స్.. 4 న వెల్లడించే కౌంటింగ్ ఫలితాల పైన ఉత్కంఠ నెలకొంది.

తమిళనాడు లో భారీగా పోలింగ్ తరువాత రెండు ప్రధాన కూటముల నేతలు నియోజకవర్గాల వారీగా విశ్లేషణలు చేసారు. ఫలితం పైన అంచనాకు వచ్చేసారు. ఇక.. ఇప్పుడు విజయ్ వద్దకు కీలక నేతలు కొత్త ప్రతిపాదనలు.. ఫార్ములాతో వస్తున్నారు. అయితే.. తన మద్దతు అవసరమైతే ఎవరికి అండగా నిలవాలో విజయ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తొలి సారి రాజకీయ బరిలోకి దిగిన విజయ్ పై మరింత పెరిగిన అంచనాలు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన ఓటింగ్ తో ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది.

Exit polls for the 2026 Five state Assembly elections are set to be released this evening

ఒక కీలక పార్టీ పునాదులు కదులుతున్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. యువత.. మహిళలు పోలింగ్ కేంద్రాల వద్ద పోటెత్తారు. దీంతో.. ఓటింగ్ సరళి పైన పార్టీలకు ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఈ ఎన్నికలు తమిళనాడులో కొత్త చరిత్ర క్రియేట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. 85 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈ మార్పు ద్రవిడ రాజకీయాల ముఖచిత్రాన్నే మార్చేస్తోంది.

ఈ పోలింగ్ శాతం.. ఓటింగ్ సరళి.. ఓటర్ల నాడి పార్టీలకు స్పష్టత ఇచ్చింది. సర్వే రిపోర్టులు సిద్దం అయ్యాయి. అయితే, ఇప్పటి వరకు వచ్చిన ఒపీనియన్ పోల్స్ కు భిన్నంగా విజయ్ కు ఓటర్లు మద్దతుగా నిలిచినట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో.. ఎక్కడ చూసినా విజయ్ ఫ్యాక్టర్ పైనే చర్చ జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ యువత.. మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు.సంప్రదాయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల పునాదులను కదిలించడం ఖాయమనే విశ్లేషణలు మొదలయ్యాయి. విజయ్ కు ఎక్కువగా పోలింగ్ జరిగి ఉంటే మాత్రం.. ఖచ్చితంగా సీఎం ఎవరనేది డిసైడ్ చేసే అవకాశం విజయ్ చేతికి చిక్కుతుంది.

దీని పైన విజయ్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక.. బెంగాల్ లో రెండో దశ పోలింగ్ లోనూ కొత్త రికార్డులు నమోదు కావటం ఖాయంగా కనిపిస్తోంది. గెలుపు ఖాయమని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. పోలింగ్ శాతం తమకే అనుకూలమని లెక్కలు వేస్తోంది. అయితే.. కొన్ని కీలక ఫ్యాక్టర్లు అక్కడ విజయం డిసైడ్ చేయనున్నాయి. మమతా మాత్రం మరోసారి గెలిచి తీరుతానని చెబుతున్నారు. మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఫలితాల పైన అంచనాలు దాదాపు అందుతున్నాయి. దీంతో, ఎగ్జిట్ పోల్స్ ఈ సాయంత్రం ఏం చెప్పబోతున్నాయనేది ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+