Exit Polls: 2021లో ఏం జరిగింది?

దేశవ్యాప్తంగా సుమారు 17 కోట్ల మంది ఓటర్లు 824 అసెంబ్లీ స్థానాలకు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో భద్రపరిచారు. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్‌లోనే ఒకే విడతలో పోలింగ్ ముగియగా, తమిళనాడులో ఏప్రిల్ 23న జరిగింది. ఇక అందరి దృష్టిని ఆకర్షించిన పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల (ఏప్రిల్ 23, 29) పోలింగ్ నేటితో పూర్తవుతుంది. ఈ ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. అంతకంటే ముందు వెలువడే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి.

బెంగాల్ మిస్టరీ: సర్వేల అంచనా తప్పిందా?

గత ఎన్నికలను (2021) పరిశీలిస్తే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పశ్చిమ బెంగాల్‌లో ఘోరంగా విఫలమయ్యాయి. టీఎంసీ, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని, బీజేపీ 100 సీట్లు దాటుతుందని మెజారిటీ సర్వేలు చెప్పాయి. 2021 లో ప్రముఖ సర్వే సంస్థలు వెల్లడించిన ఫలితాలు చూస్తే..

Exit Polls vs Actual Results Why Surveys Failed in Bengal but Succeeded in Tamil Nadu and Kerala in 2021
  • Axis My India: టీఎంసీకి 130-156, బీజేపీకి 134-160 (బీజేపీదే పైచేయి అని చెప్పింది).
  • Jan Ki Baat: బీజేపీకి ఏకంగా 162-185 సీట్లు వస్తాయని జోస్యం చెప్పింది.
  • వాస్తవం: 294 సీట్లున్న అసెంబ్లీలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 215 సీట్లతో ఘనవిజయం సాధించగా, బీజేపీ కేవలం 77 సీట్లతో సరిపెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు, వాస్తవ ఫలితాలకు ఇక్కడ భారీ తేడా కనిపించింది.

సౌత్ ఇండియాలో 'సూపర్ హిట్'..

బెంగాల్‌లో తడబడిన సర్వేలు.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం అదరగొట్టాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో అంచనాలు దాదాపు ఖచ్చితంగా సరిపోయాయి.

తమిళనాడు:

డీఎంకే కూటమి 160 సీట్లు దాటుతుందని చాలా సర్వేలు చెప్పాయి. Axis My India 175-195 సీట్లు వస్తాయని చెప్పగా, వాస్తవంగా డీఎంకే కూటమి 159 సీట్లు సాధించి అధికారాన్ని దక్కించుకుంది.

కేరళ:

ఇక్కడ నాలుగు దశాబ్దాల సంప్రదాయాన్ని తిరగరాస్తూ ఎల్డీఎఫ్ మళ్లీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ ముందే ఊహించాయి. చాలా ఏజెన్సీలు ఎల్డీఎఫ్‌కు 100 సీట్ల మార్కును అంచనా వేయగా.. ఫలితాల్లో వారు 99 సీట్లు గెలుచుకున్నారు.

అస్సాం:

ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. Axis My India ఎన్‌డీఏకు 75-85 సీట్లు వస్తాయని చెప్పగా, వాస్తవ ఫలితాల్లో 75 సీట్లతో ఎన్‌డీఏ విజయం సాధించింది.

పుదుచ్చేరి:

ఇక్కడ అధికార మార్పిడి తథ్యమని సర్వేలు చెప్పాయి. ఎన్‌డీఏ కూటమికి 19-24 సీట్లు వస్తాయని అంచనా వేయగా, వారు 16 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+