వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నేర చరిత్ర ఉన్న శశికళ సీఎం ఎలా', అంతా రహస్యం.. ఇదీ చరిత్ర!

శశికళ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో నేరాలు జరుగుతాయని, నేర చరిత్ర ఉన్న శశికళను తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎలా చేస్తారని అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప సోమవారం నాడు ప్రశ్నించారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: శశికళ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో నేరాలు జరుగుతాయని, నేర చరిత్ర ఉన్న శశికళను తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎలా చేస్తారని అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప సోమవారం నాడు ప్రశ్నించారు.

శశికళ క్రిమినల్ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ సహా నిందితురాలిగా ఉన్నారని, ఆమె పైన ఇతర కేసులు బాగానే ఉన్నాయని, ఆమె సీఎం అయితే రాజకీయ వ్యవస్థకే చెడ్డపేరు అన్నారు.

పన్నీరును తప్పించడమేంటి?: మోడీకి శశికళ సీఎం కావడం ఇష్టం లేదా?పన్నీరును తప్పించడమేంటి?: మోడీకి శశికళ సీఎం కావడం ఇష్టం లేదా?

జయ ఆసుపత్రిలో ఉన్నప్పుడు పన్నీరు సెల్వంకు ముఖ్యమంత్రి పదవి అప్పగించారని గుర్తు చేశారు. శశికళ పుష్ప పైన ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు.

అన్నాడీఎంకే పక్ష నేతగా ఎన్నికయిన తెల్లారే సుప్రీం కోర్టులో ఆమెకు షాక్ తగిలింది! మరో వారం రోజుల్లో జయలలిత అక్రమాస్తుల కేసుపై తుది తీర్పు వెలువరించనున్నట్లు తెలిపింది. ఇప్పుడు శశికళ పుష్ప.. శశికళపై నేర చరిత్ర ఆరోపణలు చేస్తున్నారు.

మన్నార్ గుడి

మన్నార్ గుడి

తమిళనాడులో ఏఐఏడీఎంకే అధికారంలో ఉందంటే రాష్ట్రమంతా 'మన్నార్‌గుడి మాఫియా' గుప్పిట్లో ఉన్నట్లేననే వాదనలు ఉన్నాయి. వారు మన్నార్‌గుడి మాఫియాగా పిలిచేది.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్న శశికళ బంధువర్గాన్నే.

పనీపాటా లేకుండా..

పనీపాటా లేకుండా..

మన్నార్ గుడిలో శశికళ సోదరుడు దివహరన్ ఓ దుకాణం ముందు పనీపాటా లేకుండా తిరుగుతుండేవాడని అంటారు. ఇప్పుడు అక్కడే ఆయన పెద్ద నాయకుడు. కావేరి డెల్టా ప్రాంతంలోని రాజకీయ, ఆర్థిక సమీకరణాలను అత్యంత ప్రభావితం చేసే వ్యక్తుల్లో ఆయన ఒకరు.

శశికళ బంధువర్గం శాసించే స్థాయికి..

శశికళ బంధువర్గం శాసించే స్థాయికి..

సుందర్‌కొట్టాయ్‌లోని సెంగమ్ల తాయార్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు మహిళల కళాశాలకు యజమాని. దాని ముందే పెద్ద నివాసం. ఆయన, ఆయనతో పాటు శశికళ బంధువర్గం.. నిలువ నీడ లేని స్థితి నుంచి రాజకీయాలను శాసించే స్థితికి ఎదిగింది.

చొచ్చుకుపోయిన మన్నార్ గుడి

చొచ్చుకుపోయిన మన్నార్ గుడి

శశికళ బంధువర్గం అంతా ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని విభాగాలు, అన్ని స్థాయిల్లోకి చొచ్చుకుపోయి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. జయ టీవీ, మంత్రుల కార్యాలయాలు, ఐఏఎస్‌ వర్గాలు, పోలీసు వ్యవస్థ ఇలా అన్నింట్లోనూ వారి ఉనికి ఉందంటారు.

అంతా రహస్యం..

అంతా రహస్యం..

అయితే వ్యవస్థంతా రహస్యంగా నడుస్తుందని, వేరొకరు వేలెత్తి చూపడానికి కూడా ఆధారాలుండవని డీఎంకే నేతల ఆరోపణ. పదవులు, ఎన్నికల టిక్కెట్ల విషయంలో మన్నార్‌ మాఫియాదే రాజ్యమని కనీసం బస్టాండుల్లోని సైకిల్‌ స్టాండ్ల కాంట్రాక్టులు కూడా వారు విడిచిపెట్టరంటున్నారు.

అంతా కార్యకలాపాలు

అంతా కార్యకలాపాలు

శశికళ బంధువర్గం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ తమ కార్యకలాపాలు సాగిస్తోంది. శశికళ, ఆమె మరదలు ఇలవరసి నివాసముండేది పోయెస్‌ గార్డెన్‌లోనే. డెల్టా జిల్లాల వ్యవహారాలు దివహరన్‌ పర్యవేక్షిస్తుంటారు.

వీరే..!

వీరే..!

శశికళ సోదరి కుమారులు దినకరన్‌, సుధాకరన్‌, భాస్కరన్‌.. తేనిలో ఉంటూ దక్షిణ తమిళనాడులో కార్యకలాపాలను నియంత్రిస్తుంటారు. సుధాకరన్‌ను ఒకప్పుడు జయ దత్తత తీసుకుని.. తర్వాత దూరం పెట్టారు.

శశికళ మద్దతుతో..

శశికళ మద్దతుతో..

శశికళ బంధువర్గ మద్దతుతోనే కొంతమంది మంత్రులు కూడా పదవుల్లో ఉంటారని చెబుతారు. శశికళ భర్త నటరాజన్‌ ఒకప్పుడు ఈ వ్యవహారాలన్నింటికి కేంద్రంగా ఉండేవారు. ప్రస్తుతం బయటి ప్రపంచానికి మాత్రం ఆయన శశికళతో సంబంధాలు లేనట్లుగా కనిపిస్తున్నారు.

English summary
Expelled AIADMK MP Sasikala Pushpa writes to PM opposing Chinnamma Sasikala as Tamil Nadu Chief Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X