'అప్పుడు వేశ్య.. ఇప్పుడు కుక్క..' : మాయావతిని మళ్లీ అవమానించిన దయాశంకర్
ఆగ్రా : వేశ్య కంటే హీనమంటూ.. కొద్దిరోజుల క్రితమే బీఎస్పీ అధినేత్రి మాయావతిపై మాట తూలి.. పార్టీ నుంచి నుంచి బహిష్కరించబడ్డ బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ మరోసారి తన పైత్యాన్ని బయటపెట్టుకున్నాడు.
మాయావతిని ఓ కుక్కతో పోల్చిన దయాశంకర్ సింగ్.. మాయావతి ఓ కుక్క లాంటిదని, డబ్బు వెనుకాలె పరుగెడుతుంటుందని తీవ్ర ఆరోపణలు చేశారు. మాయావతిని ఓ వంచకురాలిగా, పిరికిపందగా సంబోధించాడు దయాశంకర్.

అయితే దయాశంకర్ సింగ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో.. గతంలో లాగే మరోసారి మాట మార్చేశాడు. ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని కొట్టిపారేశాడు. కాగా, దయాశంకర్ సింగ్ ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా వీడియో రికార్డు కూడా ఉండడంతో.. బీఎస్పీపై నేతలతోపాటు దళితులు కూడా దయాశంకర్ వ్యాఖ్యలు పట్ల తీవ్రంగా స్పందిస్తున్నారు.
మాయావతిపై దయాశంకర్ గతంలో చేసిన వ్యాఖ్యలకు ఆయనపై ఎస్సీ యాక్ట్ నమోదైన సంగతి తెలిసిందే. కాగా, ఆదివారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో దయాశంకర్ మాట్లాడుతూ.. 'ఆమె ఓ అత్యాశ గల మహిళ. బైకు వెంట ఓ కుక్కలా పరుగెత్తుతూ అరుస్తుంటుంది. కానీ బైక్ ఆపితే మాత్రం.. తోక ముడుచుకుని వెనక్కు వెళ్లిపోతుంది' అంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు.












Click it and Unblock the Notifications