దేశంలోనే లాంగ్ జర్నీ ట్రైన్.. 9 రాష్ట్రాల మీదుగా 75 గంటల థ్రిల్లింగ్ జర్నీ

ఇండియన్ రైల్వే అంటే కేవలం ఒక ప్రయాణ సాధనం మాత్రమే కాదు.. అది కోట్ల మంది ఎమోషన్, అనుభూతుల సమాహారం. పచ్చటి పంట పొలాలు, గలగల పారే నదులు, ఎత్తైన పర్వతాలు, అలల హోరు వినిపించే సముద్ర తీరాల గుండా సాగే ప్రయాణాల్లో లభించే అనుభూతి వర్ణనాతీతం. ప్రయాణంలో వేడివేడి టీ సిప్ చేస్తూ పక్క ప్రయాణీకులతో కబుర్లు చెప్పడంలో ఉండే సరదాయే వేరు. అయితే, భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లోనే అత్యంత సుదీర్ఘమైన, ఒక వినూత్నమైన ప్రయాణ అనుభవాన్ని అందించే రైలు ఒకటుంది. అదే 'వివేక్ ఎక్స్‌ప్రెస్'. అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు సాగే ఈ సుదీర్ఘ ప్రయాణం భారతీయ సంస్కృతి, భౌగోళిక వైవిధ్యాన్ని కళ్లముందు నిలుపుతుంది.

కిటికీ పక్కన 4,188 కిలోమీటర్ల సుదూర ప్రయాణం

ఈ వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలు సుమారు 4,188 కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని అధిగమిస్తుంది. ఒక చివరి నుంచి మరో చివరికి చేరుకోవడానికి దాదాపు 75 గంటల సమయం పడుతుంది. ప్రయాణీకులు తమ సీటు మారకుండానే ఈశాన్య భారతంలోని తేయాకు తోటల నుంచి దక్షిణాన బీచ్ వరకు దేశం మొత్తాన్ని ఒకే ప్రయాణంలో చుట్టేయవచ్చు. దేశంలోని వివిధ రాష్ట్రాల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాలను ఈ ప్రయాణం ప్రతిబింబిస్తుంది.

Experience India Longest Rail Route On Vivek Express Traveling 4000 Km Across Diverse States In 75 Hours

ఈశాన్యం నుంచి దక్షిణ భారతం వరకు అద్భుతమైన మార్గం

అస్సాంలోని సుందరమైన తేయాకు తోటలు, బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న దిబ్రూగఢ్ నగరంలో ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి గువాహటి మీదుగా ఉత్తర బెంగాల్ లోని హిమాలయ పాదప్రాంతాలు, తేయాకు తోటల పచ్చదనం గుండా రైలు ముందుకు సాగుతుంది. బెంగాల్, ఒడిశా రాష్ట్రాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఈశాన్య, తూర్పు భారత కళలు, ప్రాచీన ఆలయాల వైభవం కళ్లముందు మెదులుతాయి.

ఆ తర్వాత విశాఖపట్నం, విజయవాడ మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత పొలాలను తాకుతూ ప్రయాణం కొనసాగుతుంది. అక్కడి నుంచి తమిళనాడు, కేరళ ప్రాంతాల సుందరమైన కొబ్బరి తోటలు, పచ్చని దృశ్యాలను తిలకిస్తూ చివరికి భారత దక్షిణాగ్రమైన కన్యాకుమారి చేరుకుంటుంది.

ఏపీ నుంచి బెంగళూరుకు వందే భారత్ స్లీపర్, ముహూర్తం ఫిక్స్- స్టాపులు..షెడ్యూల్..!!
ఏపీ నుంచి బెంగళూరుకు వందే భారత్ స్లీపర్, ముహూర్తం ఫిక్స్- స్టాపులు..షెడ్యూల్..!!


ఈ రైలు ప్రయాణంలో నిలిచే ప్రతి ప్రధాన స్టేషన్ ఒక ప్రత్యేక కథను చెప్తుంది:

  • గువాహటి (అస్సాం): ఈశాన్య భారత్‌కు ప్రవేశ ద్వారంగా ఉన్న ఈ నగరం అత్యంత రద్దీగల రైల్వే కేంద్రాల్లో ఒకటి.
  • న్యూ జల్పాయ్‌గురి (పశ్చిమ బెంగాల్): డార్జిలింగ్ హిల్ స్టేషన్, హిమాలయ ప్రాంతాల అందాలను ఆస్వాదించేందుకు ఇది అనువైన మార్గం.
  • భువనేశ్వర్ (ఒడిశా): "ఆలయాల నగరం"గా పేరొందిన ఈ ప్రాంతం ప్రాచీన సంస్కృతికి, ప్రాంతీయ వంటకాలకు ప్రసిద్ధి.
  • విశాఖపట్నం, విజయవాడ (ఆంధ్రప్రదేశ్): సముద్ర తీర సౌందర్యం, కనకదుర్గమ్మ ఆలయం, ప్రకాశం బ్యారేజీ వంటి ఇంజనీరింగ్ అద్భుతాలు ఈ మార్గంలో దర్శనమిస్తాయి.
  • ఎర్నాకుళం, తిరువనంతపురం (కేరళ): పచ్చటి కొబ్బరి తోటలు, బ్యాక్‌వాటర్స్ ప్రాకృతిక అందాలు ఈ ప్రయాణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
దేశంలోనే మొట్టమొదటి సారిగా పట్టాలెక్కిన LNG ట్రైన్: ఈ స్టేషన్ల మధ్య పరుగులు
దేశంలోనే మొట్టమొదటి సారిగా పట్టాలెక్కిన LNG ట్రైన్: ఈ స్టేషన్ల మధ్య పరుగులు

మూడు సముద్రాల సంగమ స్థలి వద్ద ముగింపు

రోజుల తరబడి సాగే ఈ ప్రయాణం కన్యాకుమారిలో ముగుస్తుంది. ఇక్కడ అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలు సంగమించే దృశ్యం కనువిందు చేస్తుంది. వివేకానంద రాక్ మెమోరియల్, ఇక్కడి సూర్యోదయ దృశ్యాలు ప్రయాణ అలసటనంతా మర్చిపోయేలా చేస్తాయి. వేగంగా విమానాల్లో ప్రయాణించడం కంటే, కిటికీ పక్కన కూర్చుని మారుతున్న ప్రకృతి అందాలను తిలకిస్తూ భారత్‌ను అర్థం చేసుకోవాలనుకునే వారికి వివేక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం ఒక అద్భుతమైన అనుభవం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+