ఏపీ నుంచి బెంగళూరుకు వందే భారత్ స్లీపర్, ముహూర్తం ఫిక్స్- స్టాపులు..షెడ్యూల్..!!
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకులకు రెండో వందేభారత్ స్లీపర్ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. కొంత కాలంగా చర్చల్లో ఉన్న ముంబాయి- బెంగళూరు వందేభారత్ స్లీపర్ రైలును పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఖరారు చేసారు. ఈ ప్రతిష్టాత్మక రైలు ఏపీ మీదుగా రాకపోకలు సాగించనుండటంతో రాయలసీమ ప్రాంత వాసులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఈ రైలు ఆగే స్టేషన్లతో పాటుగా రైలు ప్రయాణ వేళలను అధికారులు వెల్లడించారు.
ముంబై-బెంగళూరు మధ్య ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల ప్రయాణానికి 22 గంటల సమయం పడుతుంది. వందే భారత్ స్లీపర్ రాకతో 16 గంటలకు సమయం తగ్గనుంది. అదే విధంగా ప్రస్తుతం ముంబాయి నుంచి ప్రధాన రైళ్లు బెంగళూరు కు కొనసాగుతున్న మార్గంలోనే ఈ రైలు నడవనుంది. ఏపీలోని అనంతపురం, గుంతకల్ రైల్వే స్టేషన్లలో ఈ వందే భారత్ స్లీపర్ రైలు ఆగనుంది. ముంబైలో ప్రతీ రోజు రాత్రి 10:30 గంటలకు బయలుదేర్దనున్న ఈ రైలు.. మరుసటి రోజు మధ్యాహ్నం 2:50 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరిగు ప్రయాణంలో బెంగళూరు నుండి రాత్రి 10 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 1:50 గంటలకు ముంబైకి చేరుకుంటుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న రైళ్లల్లో జర్నీకి 22 గంటల సమయం పడుతుంది. వందే భారత్ స్లీపర్ రైలులో 16 గంటల్లోనే ప్రయాణం పూర్తి కానుంది.

రైల్వే శాఖ కసరత్తు
కాగా.. ఈ రైలు అనంతపురం, గుంతకల్లు రైల్వే స్టేషన్లలో ఆగనుండటంతో.. రాయలసీమ ప్రాంతం నుండి బెంగళూరు, ముంబైతో పాటు మార్గం మధ్యలో ఉన్న ప్రధాన నగరాలకు ప్రయాణించే వారికి ఉపయోగపడనుంది. ఈ రైలు సోలాపూర్, పూణే, కళ్యాణ్, రాయచూర్, కలబుర్గి, అనంతపురం, గుంతకల్లు స్టేషన్లలో ఆగనుందని సమాచారం. వారానికి ఆరు రోజులు నడపాలని ప్రతిపాదనలు ఉన్నాయి. కాగా.. మరో వైపు కొత్తగా ప్రవేశ పెట్టిన అమృత్ భారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో, అమృత్ భారత్ ఏసీ కోచ్ లను ప్రవేశ పెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైలును విశాఖ నుంచి తిరుపతి, లేదా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో.. త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు కొత్తగా వందేభారత్ స్లీపర్ తో పాటుగా అమృత్ భారత్ రైలు పైన ప్రకటన రానుంది.












Click it and Unblock the Notifications
