Black Triangles: అంతుచిక్కని ప్రశ్న.. ఆకాశంలో ఆ నల్లటి వింత వస్తువులేంటి?

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అత్యంత సీక్రెట్ సైనిక స్థావరాల పైభాగంలో వింత ఆకారాలు దర్శనమిచ్చి హడల్ పుట్టించాయి. అత్యున్నత సాంకేతికతను పరీక్షించే అత్యంత భద్రతా ప్రాంతాల్లో బ్లాక్ ట్రయాంగిల్ వస్తువులు స్వైరవిహారం చేసినట్లు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా ప్రభుత్వం ఇటీవల రహస్య పత్రాలను బహిర్గతం చేయడంతో ఈ మిస్టరీ వస్తువుల ఉదంతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశ భద్రతకే సవాలుగా మారిన ఈ నిగూఢ దృశ్యాలు సైనిక వర్గాల్లో తీవ్ర ఆందోళన నింపాయి.

శబ్దముండదు.. పొగరాదు! అంతరిక్ష వింత

ఎఫ్ బీఐ నివేదికల ప్రకారం.. ఈ త్రిభుజాకారపు వస్తువులు ఏకంగా గంటకు దాదాపు 1,800 మైళ్ల (సుమారు 2,900 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. సాధారణ యుద్ధ విమానాల కంటే అత్యంత వేగంగా దూసుకెళ్లినప్పటికీ, వాటి నుంచి ఎలాంటి శబ్దం కానీ, ఇంజిన్ పొగ కానీ వెలువడకపోవడం గమనార్హం. థర్మల్ పరికరాల ద్వారా పరీక్షించినప్పుడు కూడా సాంప్రదాయ విమానాల్లాంటి ఇంజిన్ ఉష్ణోగ్రతలు కనిపించలేదు. ఎలాంటి రెక్కల ఆకృతులు, విమాన కాక్‌పిట్ వంటి భాగాలు లేకుండా అత్యంత నునుపైన నిర్మాణాలుగా ఇవి కనిపించాయి.

Mysterious Black Triangles With No Exhaust Spotted Flying At 1800 Mph Over US Military Bases
1964లో మొదలైన మిస్టరీ.. 'వాల్ స్ట్రీట్ మంత్రగత్తె' తీరంలో దాగిన సీక్రెట్!
1964లో మొదలైన మిస్టరీ.. 'వాల్ స్ట్రీట్ మంత్రగత్తె' తీరంలో దాగిన సీక్రెట్!

సూపర్ పవర్ దేశాల వద్ద కూడా లేని టెక్నాలజీ

ఈ అద్భుత శక్తులు కలిగిన వింత వస్తువులు అమెరికాకు చెందిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ విమానాలు కావని అధికారులు స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రపంచంలో మరే ఇతర దేశం వద్ద కూడా ఇటువంటి విమానం లేదా డ్రోన్ టెక్నాలజీ లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇవి దేనికి సంబంధించినవి, ఎక్కడి నుంచి వచ్చాయనేది తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. భద్రతా కారణాల రీత్యా ఈ దృశ్యాలు నమోదైన ప్రాంతాలు, తేదీల వివరాలను ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.

Bermuda Triangle: వీడిన బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ..! నీటి కింద దాగిన గుట్టు..!
Bermuda Triangle: వీడిన బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ..! నీటి కింద దాగిన గుట్టు..!

రహస్యాల గుట్టు విప్పుతున్న ప్రభుత్వం

ఆకాశంలో కనిపించే ఇటువంటి అపూర్వ దృగ్విషయాలపై (UAPs) నిజాలను ప్రజలకు అందించే పారదర్శక విధానంలో భాగంగా అమెరికా ప్రభుత్వం ఈ నివేదికలను విడుదల చేసింది. వరుసగా ఏడోసారి ఈ తరహా రహస్య ఫైళ్లను బహిరంగ పరిచినప్పటికీ, ఇవి ఇతర గ్రహవాసులకు సంబంధించినవా లేక రహస్య సైనిక ప్రయోగాలా అనే అంశంపై ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లభించలేదు. దీంతో ఈ నల్లటి త్రిభుజాల మిస్టరీ అంతర్జాతీయంగా ఉత్కంఠను రేకెత్తిస్తూనే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+