వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ప్రత్యర్థులను సైతం కట్టి పడేసిన కరోనా ఆర్థిక ప్యాకేజీ: ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారుగా.. !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భయానక కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని అడ్డుకోవడానికి కేంద్రప్రభుత్వం ఓ యుద్ధాన్నే ప్రకటించింది. ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ సోకకుండా ఉండటానికి లాక్‌డౌన్‌ను ప్రకటించింది. మూడు వారాల పాటు ఈ నిర్బంధ కర్ఫ్యూ తరహా వాతావరణం కొనసాగబోతోంది. గడప దాటి బయటికి వచ్చిన వారిపై పోలీసులు లాఠీలతో విరుచుకు పడుతున్నారు. గుమ్మం దాటి బయట అడుగు పెట్టడానికి వీల్లేని వాతావరణం ఏర్పడింది.. దేశవ్యాప్తంగా.

కోటి 70 లక్షల కోట్ల రూపాయలతో..

కోటి 70 లక్షల కోట్ల రూపాయలతో..

ఇలాంటి పరిస్థితులు రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు, దినసరి వేతన కార్మికుల మాటేమిటనే ప్రశ్న తలెత్తక మానదు. అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటోడ్రైవర్లు, తోపుడుబండ్ల వ్యాపారులు.. వీరంతా రోజూ కష్టపడందే జేబులు నిండవు. ఇన్ని రోజుల పాటు ఇళ్లు దాటలేని పరిస్థితే ఎదురైతే.. వారి జీవనోపాధి ఏమిటనే అనుమానాలకు తెర దించింది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం విలువ ఏకంగా కోటి 70 లక్షల రూపాయలు.

అన్ని వర్గాల వారికీ ప్రాధాన్యత ఇస్తూ..

అన్ని వర్గాల వారికీ ప్రాధాన్యత ఇస్తూ..

లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో.. కింది స్థాయి వర్గాల రోజువారీ అవసరాలు, ఆహార అవసరాల కోసం ఈ పథకాన్ని ప్రకటించడం ఊరట కలిగించే విషయం. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వంటి రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ పథకాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారంటే.. దీనికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రోజువారీ సంపాదనతో పొట్టపోసుకునే కింది తరగతి జీవులకు ఈ ప్యాకేజీ ఖచ్చితంగా మేలు చేసేదే. లాక్‌డౌన్ మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉన్నందున, ఎలా జీవించాలో తెలియక బెంగ పట్టుకున్న వారికి ఊపిరిపోసినట్టయింది.

వైద్య సిబ్బందికి 50 లక్షల రూపాయల బీమా.. భేష్..

వైద్య సిబ్బందికి 50 లక్షల రూపాయల బీమా.. భేష్..

లాక్‌డౌన్ వల్ల నష్టపోయే బడుగు వర్గాలకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనేక వరాలు ప్రకటించాయి. దానికి అనుసంధానంగా కేంద్రం కూడా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను తెరమీదికి తీసుకొచ్చింది. దేశంలో వలస కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలను ఆదుకునేలా ప్యాకేజీ రూపొందించింది కేంద్రం. శానిటేషన్ వర్కర్లు, ఆశా, పారామెడికల్, వైద్యులు, నర్సులకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల చొప్పున ప్రత్యేక బీమా సదుపాయం కల్పించడం గొప్ప విషయం. కరోనా వైరస్ సమయంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న వారికి ప్యాకేజీ ప్రకటించడం స్వాగతిస్తున్నారు రాజకీయ నాయకులు.

మూడు నెలల పాటు నిత్యావసర సరుకులు..

మూడు నెలల పాటు నిత్యావసర సరుకులు..

వచ్చే మూడు నెలలకు ఒక్కొక్కరికి, నెలకు రూ.5 కేజీల బియ్యం పంపిణీ కుటుంబానికి కిలో చొప్పున పప్పులు అందిస్తామని, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా సాయం చేస్తామని వెల్లడించారు. డ్వాక్రా బృందాలకు రుణపరిమితి రూ.10లక్షలకు పెంచి, ఎలాంటి పూచీకత్తు లేని రుణాలు అందిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటన మహిళలకు వరంగా చెప్పుకోవచ్చు. దీనిద్వారా 63 లక్షల స్వయం సహాయక బృందాలకు లబ్ధి కలుగుతుంది.

రైతులకు నగదు బదిలీ..

రైతులకు నగదు బదిలీ..

దేశంలోని 8.69 కోట్ల మంది రైతులకు 2000 రూపాయలు చొప్పున, నగదు బదిలీ ద్వారా తక్షణమే విడుదల చేయబోతోంది కేంద్రం. ఏప్రిల్ తొలి వారంలో రైతుల ఖాతాలో ఈ మొత్తం బదిలీ అవుతుంది. అలాగే-మూడు కోట్ల మంది వృద్ధులు, దివ్యాంగులు, పింఛనుదారులకు, రెండు విడతలో అదనంగా 1000 రూపాయలు చెల్లించనుంది. జన్‌ధన్ ఖాతాలున్న 20 కోట్ల మంది మహిళలకు, నెలకు 500 రూపాయలు చొప్పున వచ్చే మూడు నెలల పాటు పరిహారం చెల్లిస్తుంది. ఇవన్నీ పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా సహాయకారిగా ఉన్న పథకాలే.

 పీఎఫ్ నగదు కేంద్రమే భరించేలా..

పీఎఫ్ నగదు కేంద్రమే భరించేలా..


15 వేల రూపాయలలోపు జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందాను భరించడానికి కేంద్రమే ముందుకొచ్చింది. ఉద్యోగి వాటా, యజమాని వాటాను కలిపి, ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేస్తుంది. దేశంలోని భవన నిర్మాణ కార్మికులకు కూడా కేంద్రం భరోసా ఇచ్చింది. దేశంలో 3.5 కోట్ల మంది నమోదిత భవన నిర్మాణ కార్మికులు ఉండగా, వారి సంక్షేమానికి రూ.31 వేల కోట్ల నిధి ఇప్పటికే ఉంది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం వినియోగించుకోవాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. కోటి 70 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ లోటును కేంద్రం ఎలా భర్తీ చేసుకుంటుందనే విషయంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పరిస్థితి అంతా కుదుటపడ్డప్పుడు భారీగా రేట్లు పెంచే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి..

English summary
For economic agents – particularly poor households and small businesses – the crisis today is a crisis of liquidity. The nationwide lockdown, imposed to stop the novel coronovirus in its tracks, has led to scores of daily wage workers and informal sector entrepreneurs losing earning opportunities from their existing activities. On Thursday, Finance Minister Nirmala Sitharaman announced a Rs 1.70 lakh crore ‘Pradhan Mantri Garib Kalyan Yojana’ relief package to alleviate the distress of those least equipped to bear the cost of staying at home for the larger public interest of battling the COVID-19 pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X