అర్ధరాత్రి పాక్ కు చావు దెబ్బ - అతలా కుతలం, మూసివేత..!!
ఆపరేషన్ సింధూర్ -2 దెబ్బకు పాక్ విలవిల్లాడుతోంది. పాక్ లోని నగరాల పైన డ్రోన్ దాడులకు పాక్ తెగ బడుతోంది. భారత సైన్యం వాటిని నిర్వీర్యం చేస్తోంది. ఇదే సమయంలో జమ్ములోని పలు ప్రాంతాల్లో పాక్ కాల్పులు కొనసాగిస్తోంది. భారత్ లోని జనావాసాలు టార్గెట్ గా పాక్ చేస్తున్న కుట్రను భారత్ తిప్పి కట్టింది. పాక్ లోని నాలుగు ఏయిర్ బేస్ ల వద్ద పేలుళ్లు చోటు చేసుకోగా.. భారత్ దాడి చేసిందని పాక్ ఆరోపిస్తోంది. వరుస పేలుళ్లతో పాక్ లో అల్ల కల్లోలం మొదలైంది. కాగా, ఇటు భారత్ పూర్తి స్థాయిలో అప్రమత్తం అయింది. అటు పాక్ గగనతలం మూసివేసింది.
అర్ద్రరాత్రి అల్లకల్లోలం
పాక్ లో అర్ద్రరాత్రి అల్ల కల్లోలంచోటు చేసుకుంది. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్, షోర్‌కోట్, మురిద్ వైమానిక దళ స్థావరాల వద్ద జరిగిన పేలుళ్లతో పాక్ ఉలిక్కి పడింది. భారత్ దాడి చేసిందని పాక్ ఆరోపిస్తోంది. అయితే, వైమానిక స్థావరంపై ప్రతీకార చర్యను భారతదేశం ఇంకా ధృవీకరించలేదు. రావల్పిండిలోని వైమానిక స్థావరంపై భారత యుద్ధ విమానాలు క్షిపణులను ప్రయోగించాయని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి ఆరోపించారు. కాసేపట్లో భారత విదేశాంగ శాఖ ఈ ఆరోపణల పైన స్పందించనుంది. కాగా, పాక్ తన గగన తలాన్ని మూసివేసింది. 10వ తేదీ మధ్యాహ్నం వరకు పూర్తిగా మూసివేసారు.

వరుస పేలుళ్లు
పాక్ లోని లాహోర్ తో పాటుగా ప్రధాన ఏయిర్ బేస్ ల వద్ద పేలుళ్లు చోటు చేసుకున్నట్లు కధనాలు వస్తున్నాయి. ఇక, పాక్ బాలిస్టిక్ క్షిపణని భారత్ కూల్చి వేసింది. హర్యానాలో పాక్ క్షిపణి ఫతాను భారత ఆర్మీ కూల్చి వేసినట్లు తెలుస్తోంది. అటు జమ్ము సరిహద్దుల్లో పాక్ కాల్పులకు తెగ బడింది. ఇటు శ్రీనగర్ వద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. పాక్ డ్రోన్ దాడిని భారత్ తిప్పి కొట్టింది. భారత బలగాలు పాక్ కు ధీటుగా సమాధానం ఇస్తున్నాయి. పాకిస్తాన్ నుండి నౌషేరాలో షెల్లింగ్ జరుగుతోంది. ఉధంపుర్, సాంబా, జమ్ము, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో పాక్ దాడి చేసిన 50 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది. జైసల్మేర్‌లోనూ డ్రోన్లతో పాక్ చేసిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది.
పాక్ మిసైల్ కూల్చివేత
పాక్ డ్రోన్లతో పాటుగా మిసైల్స్ ను భారత్ కూల్చి వేస్తోంది. ఇటు జమ్మూ డివిజన్ ఉదంపూర్‌లో సైరన్ శబ్దాలు- టోటల్ బ్లాక్ అవుట్ ప్రకటించారు. జమ్మూ డివిజన్ ఉదంపూర్‌లో పూర్తిగా విద్యుత్ నిలిపివే సారు. అమృత్సర్, పఠాన్‌కోట్, ఫిరోజ్పూర్లో పాక్ డ్రోన్ దాడులకు ప్రయత్నిస్తోంది. కశ్మీర్‌లోని అవంతిపొరా వైమానిక స్థావరంపై దాడులకు పాక్ యత్నించగా.. భారత్ తిప్పి కొట్టింది. అటు ప్రధాని మోదీ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. త్రివిధ దళాధిపతులు, రక్షణ మంత్రితో మోదీ భేటీ అయ్యారు. సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేరుగా మోదీ చర్చలు చేస్తున్నారు. కాగా, పాక్ తమ నగరాల పై భారత్ దాడి చేసిందనే ఆరోపణల పైన కాసేపట్లో భారత విదేశాంగ శాఖ స్పష్టత ఇవ్వనుంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications