ఐటీ హబ్ లో కలకలం, ప్రైవేట్ స్కూల్ పక్కలో ఏం జరిగిందింటే ?, పరుగో పరుగు !

బెంగళూరు సిటీలో ఇటీవల కాలంలో బాంబుల భయం పెరిగిపోయి. బాంబులు పెట్టి అనుకున్న టార్గెట్ ముగించుకుని సైలెంట్ గా తప్పించుకుంటున్నారు. దీనికి రామేశ్వరం కేఫ్ లో ఇటీవల జరిగిన బాంబు పేలుడు కేసుఓ నిదర్శనం అని ప్రజలు అంటున్నారు. ఇటీవల పాఠశాలలు, పోలీస్ స్టేషన్లకు బాంబు బెదిరింపు ఫోన్లు రావడం హాట్ టాపిక్ అయ్యింది.

ప్రస్తుతం బెంగళూరు నగరంలోని ఓ పాఠశాలలో పేలుడు పదార్థాలు లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. బెంగళూరులోని బెళ్లందూరులోని పాఠశాల ఆవరణం సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యం కావడంతో చిన్నారులు, వాళ్ల తల్లిదండ్రుల్లో ఆందోళనతో పరుగుతీశారు. బెంగళూరులోని బెళ్లందూరులోని ప్రక్రియా స్కూల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో జిలెటిన్‌ స్టిక్‌, డిటోనేటర్‌తో పాటు మరికొన్ని ప్రొజెక్‌టైల్‌లు కనిపించడంతో స్కూల్ లోని విద్యార్థులను, స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Explosives were found in the premises of a private school in Bengaluru and everyone was shocked

పేలుడు పదార్థాలను అక్రమంగా సేకరించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. పాఠశాలకు సమీపంలోనే భవనాన్ని నిర్మిస్తున్నారని, రాళ్లు పేల్చడానికి పేలుడు పదార్థాలు తెచ్చి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని ఒక ట్రాక్టర్‌లో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. అక్రమంగా పేలుడు పదార్థాల కొనుగోలు, రవాణాపై కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనా స్థలంలో ఆదారాలు సేకరించారు. బెళ్లందూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బెంగళూరు నగరంలోని కుందనహళ్లిలోని రామేశ్వరం కేఫ్ బాంబ్ పేలుడు కేసు ఇంకా కొలిక్కి రాలేదు. ఇలాంటి సమయంలో బెంగళూరులోని బెళ్లందూరులోపి పాఠశాల ఆవరణం సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యం కావడంతో బెంగళూరు ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు నిందితుల ఆచూకీ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. అయితే రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులోని ప్రధాన నిందితుడి ఆచూకీ ఇంకా చిక్కలేదని అధికారులు అంటున్నారు.

Explosives were found in the premises of a private school in Bengaluru and everyone was shocked

రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసుకు ముందు బెంగళూరులోని పలు ప్రతిష్టాత్మక పాఠశాలలకు బాంబు బెదిరింపు ఫోన్లు, ఈమెయిల్ బెదిరింపు సందేశాలు వచ్చాయి. దీంతో పాఠశాల యాజమాన్యం పోలీసులను పిలిపించి తనిఖీలు చేసింది. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. పరిశీలించిన పోలీసులు అది ఫేక్ మెసేజ్ అని స్పష్టం చేశారు. దీని తర్వాత మార్చి 1వ తేదీన రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలడంతో అన్ని చోట్లా అప్రమత్తమైంది.

ప్రస్తుతం దేశంలో, కర్ణాటక రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటంతో ఎక్కడికక్కడ పోలీసుల నిఘా ఉంది. బెంగళూరులో జరిగిన ఈ పరిణామాలన్నింటి తర్వాత ఐటీ హబ్ సిటీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. బెంగళూరులోనే కాకుండా తమిళనాడుతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లోని పాఠశాలలకు కూడా బెదిరింపు సందేశాలు వచ్చాయి. రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన జరిగిన తర్వాత ఎలాంటి సందేశం వచ్చినా దీని వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందనే అనుమానంతో పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+